చిత్తూరు

ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 20: చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఒంటరిగాఉన్న మహిళల మెడలో నుంచి బంగారు చైన్లను లాక్కెళ్తున్న ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు చిత్తూరు తాలుకా సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రాత్రి చిత్తూరు జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిత్తూరు రూరల్ మండలం కుర్చివేడుకు చెందిన మురుగన్, ఉదయ్ ద్విచక్రవాహనంలో వెళ్తుండగా వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. వీరిరువురు గత కొంతకాలంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహనంలో వెళ్తూ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్తున్న ముఠా సభ్యులుగా గుర్తించామన్నారు. వీరి వద్ద నుంచి 4లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

కామాంధుడిపై నిర్భయచట్టం కేసుగా నమోదు
మదనపల్లె, నవంబర్ 20: అభం శుభం ఎరుగుని నాలుగేళ్ల చిన్నారిపై పాతికేళ్ల వ్యక్తి పైశాచికానికి పాల్పడ్డాడు. గ్రామస్థుల దేహశుద్ధి అనంతరం గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. సోమవారం కామాంధుడిపై అత్యాచారయత్నం, నిర్భయచట్టం కింద కేసునమోదు చేసినట్లు మదనపల్లె తాలూకా ఎస్‌ఐ రమేష్ వెల్లడించారు. మంగళవారం నిందితుడిన్ని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. చిన్నారి కుటుంబానికి ఎపీ రజక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపల్లె లక్ష్మయ్య, స్థానిక రజక సంఘం నాయకులు మంగళవారం ఆర్థికసహాయం అందజేసి ఆసరగా నిలిచారు. బాధిత కుటుంబానికి ఎన్టీఆర్ గృహం మంజూరు చేయాలని, బ్యాంకు రుణం మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మద్యం తాగి వ్యక్తి మృతి
మదనపల్లె, నవంబర్ 20: మద్యం తాగి ఓవ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ మొరాలకు చెందిన బాషా(40) భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజు కూలీపనుల నిమిత్తం మదనపల్లెకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చేవాడు. మంగళవారం సెలవు కావడం, వారంతరం చేసిన కూలీసొమ్ములు సోమవారం సాయంత్రమే తీసుకోవడం, దీంతో పూటుగా మద్యం సేవించిన బాష స్వగ్రామం వెళ్ళేందుకు మొలకలదినె్న క్రాసు వద్ద దిగి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గంలో తూలి కిందకు పడిపోయాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించగా గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నాం కుటుంబసభ్యులు గమనించి మొరాలకు చెందిన బాషాగా గుర్తించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.