చిత్తూరు

సహకార సంఘంలో ఏకరూప సాంకేతికత పరిజ్ఞానం అమలు అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, నవంబర్ 20: గ్రామీణ, పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం సహకార సంస్థను తీసుకురావడం జరిగిందని, అయితే సహకార సంఘంలో ఏకరూప సాంకేతిక పరిజ్ఞానం అమలుచేయడంలో అసాధ్యమని మదనపల్లె కో-ఆపరేటీవ్ టౌన్‌బ్యాంకు చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ అన్నారు. సహకార సంస్థపై ప్రతిఏటా అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ నాదేళ్ళ విద్యాసాగర్ తెలిపారు. సహకార వారోత్సవాల ముగింపు ఉత్సవాలు మంగళవారం స్థానిక టౌన్‌బ్యాంకు ప్రధానకార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా సహకార వ్యవస్థ, సుపరిపాలన, నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం సహకార సంస్థల ద్వారా అనే అంశంపై ఛైర్మన్ విద్యాసాగర్ మాట్లాడారు. సహకార సంస్థలో ఏకరూప సాంకేతిక పరిజ్ఞానం అమలు కావడం సాధ్యం కాదని, అన్ని ప్రభుత్వ విభాగాలలో ఒక్కో విభాగానికి ఒకే రకమైన సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుందని, అయితే సహకార వ్యవస్థలో అనేక రకాలైన సహకారసంఘాలు ఉన్నాయని, ఈ సంఘాలన్నీ వివిధ రకాలైన వ్యాపార పద్ధతులు, కలిగివున్నాయన్నారు. అన్నింటికీ ఒకేరకమైన సాంకేతిక పరిజ్ఞానం సహకారశాఖ ద్వారా అందించలేమన్నారు. అందుకే ప్రతియొక్క సహకార సంఘం తమ వ్యాపారానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలన్నారు. వృత్తినైపుణ్యత పెంపొందించు కోవడానికి టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, లేనిపక్షంలో పురోగతి సాధించలేమన్నారు. టౌన్‌బ్యాంకులో పాత సంప్రదాయ వ్యవస్థను, కాలానుగుణంగా ఖాతాదారులకు అనుకూలంగా ఇతర జాతీయ వాణిజ్యబ్యాంకుల తరహాలో అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. బ్యాంకులో పేపర్ రహిత పాలన అందించేందుకు బ్యాంకు సిబ్బందికి త్వరలో టెక్నాలజీపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ చంద్రశేఖర్, బ్యాంక్ సిఇఓ ప్రసాద్, డైరెక్టర్లు పసుపురవి, శ్రీరామరవికాంత్, భాస్కర్‌కుమార్, ఆర్.సోమశేఖర్, ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఏ రియాజ్‌ఖాన్, మధుకర్, రవికుమార్, ముక్తియార్‌ఖాన్, పసుపురవి, సహకార శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

రౌడీ షీటర్లపై నిఘా పెంచడానికే ఒక రౌడీ ఒక పోలీస్
* డిఎస్‌పి చిదానందరెడ్డి
పెద్దతిప్పసముద్రం, నవంబర్ 20: రౌడీషీటర్లపై నిఘా పెంచడానికే ఒక రౌడీ ఒక పోలీస్ యాప్‌ను ప్రారంభించామని మదనపల్లె డిఎస్‌పి చిదానందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పిటిఎం మండల పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు రానున్న సందర్భంగా రౌడీ షిటర్ల ప్రవర్తనపై నిఘా ఉంచడానికి ఒక రౌడీ ఒక పోలీస్ యాప్‌ను ప్రారంభించామన్నారు. ప్రతి రౌడీ షీటర్‌కు ఒక కానిస్టేబుల్ అతని వివరాలు తెలుసుకునే విధంగా ఈ యాప్ పనిచేస్తుందని తెలిపారు. రౌడీల పరివర్తన, ప్రతి రోజు పోలీసులు రౌడీలతో మాట్లాడుతూ వారు ఉన్న ప్రదేశాన్ని ఈ యాప్‌ద్వారా తెలుసుకుంటారన్నారు. అవసరమైతే వారి ఇండ్లను పరిశీలించి వారి పరివర్తనపై విచారణ చేపడుతారన్నారు. పిటియం మండలంలో ఎంత మందిపై రౌడీ షిట్ ఉందని ఎస్‌ఐ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏ-1, బి-2, తదితర రౌడీషీటర్ల వద్ద మోబైల్ ఫోన్లలో ఒక రౌడీ ఒక పోలీస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుత జిల్లా ఏస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ ఆండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెండు నెలల కాలంగా మదనపల్లె డివిజన్‌లో రోడ్డు భధ్రత ప్రమాణాలు పాటించడంతో ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్నాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఎలాంటి అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులకు ఆదేశించారు. మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడిపిన లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సిబ్బంది ఎక్కడికెళ్లినా స్థానిక రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.