చిత్తూరు

జెండాలు వేరైనా మహాకూటమి గెలుపే ఎజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 21: జెండాలు వేరైనా మహాకూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా ఎజెండాను రూపొందించుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తామని మహాకూటమి నేతలు ప్రకటించారు. బుధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మహాకూటమి అభ్యర్థి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు తాళ్లూరి వెంకటేశ్వరరావులు మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేతలందరినీ అణగదొక్కే విధంగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఉద్యమ ఫలాలను ప్రజలకు అందకుండా చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే లక్ష్యంగా మహాకూటమి ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులను అందలం ఎక్కించే విధంగా కెసిఆర్ ప్రయత్నించాడని ఆరోపించారు. తెలంగాణ ద్రోహి అయిన జలగం కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిన కెసిఆర్ నిజాం తరహా పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. కొత్తగూడెం నియోజక వర్గంలో మహాకూటమి అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా నియంతృత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో కొత్తగూడెం నియోజక వర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాల పేరుతో కమీషన్లు దండుకున్న కెసిఆర్ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన ప్రజలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. రైతుబంధ పథకం భూస్వాముల ప్రయోజనాలకే పరిమితమైందన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రత్యేక ఎజెండాతో పరిపాలన సాగిస్తూ ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నాడని ఆరోపించారు. కొత్తగూడెం నియోజక వర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి జలగం వెంకటరావును ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్ అభ్యర్ధులను అనేక నియోజక వర్గాల్లో గ్రామాల్లోకి రాకుండా ప్రజలు అడ్డుకుంటున్నారంటే ప్రజల నుంచి ఎంత తిరుగుబాటు వస్తుందో అర్ధమవుతోందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవలు అందించకుండా నియంతృత్వ విధానలను అమలు చేస్తున్న టిఆర్‌ఎస్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే ఆ పార్టీని ఓడించటమే అందరి లక్ష్యం కావాలన్నారు. ఈసమావేశంలో మహాకూటమి నాయకులు కంచర్ల గోపాలకృష్ణ, కాసలు వెంకటేశ్వరరావు, రజాక్, వనమా రాఘవేంద్రరావు, కోనేరు పూర్ణచంద్రరావు, బత్తుల వీరయ్య, జక్కుల నరేందర్, అన్వర్ పాషా, యాదవ్, ఎర్రా కామేష్, స్టీవెన్, రావి రాంబాబు, బివి రమణారావు, గుడివాల రామలక్ష్మణ్, వల్లాల భరత్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా ఓటర్ల కోసం గాలం
ఖమ్మం, నవంబర్ 21: ఖమ్మం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు మహిళా సంఘాలలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నిత్యం తమ ప్రచారంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనేలా చూడటం, ఎక్కువ మందిని ప్రత్యక్షంగా కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఆత్మీయ సమావేశాల పేరుతో వారిని కలిసిన నేతలు వారి సమస్యలను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మహిళా గ్రూపులలో ఉన్న వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ నేతల ద్వారానైనా కలిసి వారికి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లోని పార్టీల నేతలు మహిళా సంఘాలతో రాత్రి సమయాల్లో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో మహిళ ఓటర్ల సంఖ్య 5,36,140మంది ఉన్నారు. వీరిలో మహిళ సంఘాల్లో సభ్యత్వ కలిగిన వారు 2,28,611మంది ఉన్నారు. వీరంతా గ్రామీణ మహిళలే వీరు కాక పట్టణాల్లోని మహిళ గ్రూపుల్లో ఉన్నవారి సంఖ్య అదనం. ఎన్నికల భరిలో ఉన్న అభ్యర్థులు మహిళ సంఘాలను కలిసి తమ నేతకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ పరిణామంతో మహిళా గ్రూపుల్లో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం నియోజకవర్గంలో 1173సంఘాలు ఉండగా 11,339మంది సభ్యులు ఉండగా, మధిర నియోజకవర్గంలో 5,804సంఘాలలో 53,843మంది, వైరా నియోజకవర్గంలో 4,137 సంఘాలలో 38,909సభ్యులు ఉండగా కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండగా అక్కడ మరో వెయ్యి గ్రూపులు ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలో 6,338సంఘాలకు గాను 57,817మంది, సత్తుపల్లి నియోజకవర్గంలో 5,276సంఘాలలో 57,244మంది సభ్యులు ఉన్నారు. ఎన్నికల ఫలితాన్ని శాసించే స్థాయిలో మహిళా సంఘాలు ఉండటంతో వారిని ఆకట్టుకుని తమకు మద్దతు తెలిపేలా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొందరూ మహిళా సంఘాల నేతలు కొన్ని రాజకీయ పార్టీల పక్షాన తిరుగుతూ తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండటం విశేషం.

టీడీపీ అభ్యర్థులను గెలిపించండి
* టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్
ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మహాకూటమి బలపర్చిన టిడిపి అభ్యర్థులను గెలిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం మరింత అభివృద్ధి చెందిందన్నారు. తిరుమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాటుపడుతున్నారని పేర్కొన్నారు. వెనుకబడి ఉన్న యాదవులను అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడుకు యాదవులు రుణపడి ఉంటారన్నారు. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తనకు చైర్మన్‌గా గుర్తింపు నిచ్చి యాదవుల ఖ్యాతిని పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. టిటిడిలో సేవలు చేయటం తన అదృష్టమని ఇంతటి అవకాశం తనకు రావటం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో మహాకూటమి బలపర్చిన టిడిపి అభ్యర్థులైన సండ్ర వెంకటవీరయ్య, నామా నాగేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే మహాకూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకొని జిల్లాలోని 10కి 10స్థానాలు గెలుచుకొని చరిత్రలో నిలిచిపోయేలా కృషి చేయాలన్నారు. దేశంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలో శాసిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో నిరంకుశ పాలన చేస్తున్న టిఆర్‌ఎస్ పార్టీని గద్దె దించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. విలేఖరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, టిడిపి నాయకులు చిత్తారు సింహద్రియాదవ్, టిడిపి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పుల్లారావుయాదవ్, కాంగ్రెస్ నాయకులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.