చిత్తూరు

హథీరాంజీ మఠం భూములు పేదలకు పంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని, వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే హథీరాంజీ మఠం భూములు ఆక్రమణలకు గురయ్యాయయని, మిగిలిన భూములు కూడా ఆక్రమణకు గురికాకముందే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇళ్లులేని పేదలు, టీటీడీ ఉద్యోగులు, పేద జర్నలిస్టులకు వెంటనే వాటిని పంచాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిప్రతాన్ని సబ్ కలెక్టర్ మహేష్ కుమార్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ, ఐఎన్‌టీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నవీన్‌కుమార్ రెడ్డి, బ్రహ్మనందం, పూతలపట్టు ప్రభాకర్, వెంకటాద్రి, సావిత్రి యాదవ్, శాంతి యాదవ్, తేజోవతి, మునిశోభ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

12న పర్యావరణ హిత బ్యాగుల తయారీ పరిశ్రమ ప్రారంభం
తిరుపతి, డిసెంబర్ 10: రాష్ట్రంలోనే తొలిసారిగా జర్మన్ టెక్నాలజీతో రేణిగుంట పారిశ్రామిక వాడలో కాలుష్య రహిత, పర్యావరణహిత సంచుల తయారీ పరిశ్రమను ఈనెల 12న ప్రారంభిస్తున్నట్లు యూనివర్శల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్టనర్స్ కొండూరు శివమ్మ, బొల్లినేని నిరీష తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా పారిశ్రామిక ఔత్సాహికులుగా తామీ పరిశ్రమను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో సరుకు రవాణా బ్యాగులు, హాస్పిటల్స్, పరిశ్రమలకు, ఫార్మాస్యూటికల్ ప్యాకింగ్‌కు, చిన్న చిన్న వ్యాపారస్థులకు ఉపయోగపడే విధంగా బ్యాగులను తయారు చేయనున్నట్లు తెలిపారు. వీటిని వినియోగించిన తరువాత భూమిలో 180 రోజుల్లో కలిసిపోతాయని, ఎరువుగా సైతం ఉపయోగపడుతాయని వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వౌలికవసతుల సలహాదారు రెడ్డివారి ప్రీతమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రాబ్యాంక్ జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.మురళీకృష్ణా రావులు ప్రారంభిస్తారని తెలియజేశారు. ఈకార్యక్రమంలో కేశవరాజు, రాకేష్, ఆదికేశవులు రెడ్డి పాల్గొన్నారు.

తిరుచానూరులో నేడు రథోత్సవం
తిరుపతి, డిసెంబర్ 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదోరోజైన మంగళవారం ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవంగా తిరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కాగా రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు.