చిత్తూరు

ఎనిమిదవ రోజూ కొనసాగిన వెలుగు ఉద్యోగుల దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 12 : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే వెలుగు ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఆ శాఖలో పనులు ఎక్కడికక్కడ స్తంభించాయి. వెలుగు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ సామూహికంగా విధులు బహిష్కరించి నిరాహారదీక్షలో పాల్గొనడంతో ఆ శాఖలోని పనులు కుంటుపడ్డాయి. ముఖ్యంగా సామాజిక పింఛన్లు, డ్వాక్రా సభ్యులకు మంజూరు చేసే బ్యాంకు లింకేజీలు, పాలశీతల కేంద్రాల నిర్వహణ, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఉద్యాన పంటల పెంపకంతో పాటు మరో 13 కార్యక్రమాల నిర్వహణకు తీవ్ర ఆందోళనలో భాగంగా ఎనిమిదవ రోజైన వెలుగు ఉద్యోగులు బుధవారం కలెక్టరేట్ మెయిన్ గేటు ఎదురుగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలో వెలుగు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు జీవీ రమణ, పేట హరికృష్ణారెడ్డి, లోకనాథరెడ్డి, ధనంజయులురెడ్డి, రవి, శింగన్న, మునిరత్నం, ఉమాపతి తదితరులతో పాటు, 300 మందికి పైగా వెలుగు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.