చిత్తూరు

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ఏడు గంగమ్మల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, డిసెంబర్ 12: శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం ఏడు గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ గుడి వీధిలోని గంగమ్మ దేవస్థానానికి ఏడు గంగమ్మల దేవతామూర్తులను మేళతాళాల మధ్య విశేష పుష్పాలంకరణలలో పురవీధుల్లో ఊరేగిస్తూ ఆయా ప్రాంతాల్లో అమ్మవార్లను ప్రతిష్ఠించారు. అందులో భాగంగా పెళ్లిమండపం వద్ద పొన్నాలమ్మ, సన్నిధివీధిలో నల్లగంగమ్మ, జయరాంరావువీధిలో కావమ్మ, గాలిగోపురం వద్ద అంకాలమ్మ, కుమారస్వామి దిబ్బ వద్ద అంకమ్మ, కొత్తపేటలో భువనేశ్వరి, భేరివారి మండపం వద్ద ముత్యాలమ్మ అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీంతో భక్తులు వేపాకు మండలు ధరించి వెయ్యికళ్ల దుత్తలు చేతబట్టి భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అంబళ్లుపోశారు. జాతర ఎలా జరుగుతుందని శ్రీకాళహస్తి మునిసిపల్ ఛైర్మన్ ముత్యాల పార్థసారధి ఏడు గంగమ్మలను ప్రతిష్ఠించిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత, భక్తులకు తాగునీటి సౌకర్యం వంటి వసతులను మునిసిపాలిటీ తరపున నిర్వహించారు. అమ్మవార్లను పట్టణ ప్రముఖులు దర్శించుకున్నారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లుచేశాం
* మునిసిపల్ కమిషనర్ రమేష్‌బాబు
ఏడు గంగమ్మల జాతరను పురస్కరించుకొని పట్టణంలో శ్రీకాళహస్తి మునిసిపాలిటీ తరపున కార్మికులను టీములుగా విభజించి పారిశుద్ధ్య నిర్వహణ పనులు నిర్వహించామని మునిసిపల్ కమిషనర్ రమేష్‌బాబు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట పెళ్ళిమండం, భేరివారి మండపం, నగిరివీధి, జయారామరావువీధి, ముత్యాలమ్మ గుడి వీధి, బాబు అగ్రహారం తదితర ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లామని, దోమల బెడద నివారణకు మలేరియా స్ప్రే చేశామని, భక్తులు వ్యర్థపదార్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా డస్ట్‌బిన్‌లను కూడా ఏర్పాటుచేశామన్నారు. మొత్తం మీద జాతరలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తిలో పట్టణంలో జరగబోయే కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తామన్నారు.

ఏనుగుల దాడిలో పంట నష్టం
బంగారుపాళ్యం, డిసెంబర్ 12: మండలంలోని కామక్షమ్మ పొలిమేరల్లో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేసి నష్టపరిచాయని బాధిత రైతులు మోహన్, బాలకృష్ణ, కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి జరిగిన ఏనుగుల దాడిలో వరి, అరటి, కొబ్బరి పంటలు తీవ్రంగా నష్టపరిచాయని తెలిపారు. సంఘటన స్థలాన్ని ఫారెస్ట్ అధికారి మొగిలప్ప పరిశీలించారు. దీనితో నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఈ మేరకు వినతిపత్రాన్ని తహశీల్దార్ గోపాలయ్యకు అందచేశారు.

ఒంటరి ఏనుగు సంచారం
పలమనేరు, డిసెంబర్ 12 : పట్టణ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం పక్కన ఒంటరి ఏనుగు ద్విచక్ర వాహనదారుల కంటపడింది. దీనిపై వెంటనే ఎఫ్‌ఆర్‌ఓ మదన్‌మోహన్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు. జాతీయ రహదారి దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఏనుగు ప్రజల కంటపడింది. దీన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తుండగా, తప్పించుకొని తిరుగుతున్నది. పంట పొలాలపైకి రానివ్వకుండా అటవీ అధికారులు రేయింబవళ్లు బాణాసంచా పేలుస్తూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఏనుగును పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.

నేటి రాత్రి 9 నుంచి 12 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ సేవలకు బ్రేక్
తిరుపతి, డిసెంబర్ 12: టీటీడీ సేవలను బుక్ చేసుకునేందుకు వినియోగించే టీటీడీసేవాన్‌లైన్.కామ్ వెబ్ సైట్ గురువారం రాత్రి 9 నుంచి 12 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ పీఆర్వో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వదర్శనం, దివ్యదర్శనం, టైంస్లాట్ సర్వదర్శనం, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను అప్‌డేట్ చేయాలని నిర్ణయించడం జరిగిందని, ఇందులో భాగంగానే కొన్ని గంటలపాటు ఈ వెబ్‌సైట్ సేవలను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.