చిత్తూరు

తిరుమలకు ఛేరుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం మాజీ ప్రధాని దేవెగౌడ మంగళవారం సాయంత్రం తిరుమలకు విచ్చేశారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు విచ్చేశారు. ఈసందర్భంగా పద్మావతి అతిధిగృహాల సముదాయాల్లోని పాండవం అతిధి భవనం వద్ద రిసెప్షన్ డిప్యూటీ ఇఒ హరేంద్రనాథ్, ఓఎస్‌డి లక్ష్మీనారాయణ యాదవ్ పుష్పగుచ్ఛంతో ఆయనకు సాదరస్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి తిరుమల్లోనే బసచేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆయన తిరుగుప్రయాణం అవుతారు.