చిత్తూరు

అమ్మవారి ఆలయంలో చోరీల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు,మే 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను తిరుచానూరు పోలీసులు అరెస్ట్‌చేశారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరు పాపంపట్టుచెరువుకు చెందిన శారద (29), లక్ష్మి (40), ఐశ్వర్య (22) మరియు కర్ణాటక రాష్ట్రం దిరుదన హెళ్లి రాష్ట్రానికి చెందిన మంజు (20), జ్యోతి (34), పూర్వతి (34) వీరందరూ కలిసి విలాసవంతమైన జీవితం గడపడానికి సులభంగా డబ్బు సంపాదించడానికి వారి భర్తల ప్రోత్సాహంతో దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా మార్చి, ఏప్రిల్ నెలల్లో 11 మంది కుటుంబ సభ్యులూ కలిసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని క్యూలైన్లలో సామాన్యభక్తుల వలే ప్రవేశించి అమ్మవారి దర్శనార్థం వచ్చిన మహిళా భక్తుల యొక్క హ్యాండ్ బ్యాగ్, మెడలోని బంగారు నగలను చాకచక్యంగా దొంగలించేవారు. ఈ క్రమంలో దొంగలించిన నగలను అమ్మి సొమ్ముచేసుకోవడానికి సోమవారం సాయంత్రం స్థానిక సిందూ కూడలి వద్ద అనుమానాస్పదంగా గుంపుగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వీరు చేసిన నేరాలను అంగీకరించారు. వారి వద్దనుంచి ఏడు లక్షల 32 వేల రూపాయలు విలువచేసే 244 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ 11 మంది నిందితుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. వీరందరూ భార్యాభర్తలని అడిషినల్ ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి నిందితులను రిమాండుకు తరిలిస్తున్నట్లు ఆయన తెలిపారు.