చిత్తూరు

గంగమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 17: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. నగరంలో ఎటుచూసినా గంగజాతర సంబరాలే కనిపించాయి. ఈనెల 10వ తేదీన చాటింపుతోప్రారంభమైన జాతర మంగళవారంతో ముగుస్తుంది. అయితే బుధవారం తెల్లవారుజామున ఆలయంలోని విశ్వరూప స్థంభానికి గంగమ్మ విశ్వరూపాన్ని పేరంటాళ్ళు చెంపనరకడంతో జాతర ముగిసినట్లు భావిస్తారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా మంగళవారం చాటింపుతో ప్రారంభమై తిరిగి మంగళవారంతో ముగిసే అమ్మవారి జాతరలో ఆఖరిరోజున భక్తులు తండోపతండాలు తరలి వచ్చి గంగమ్మను దర్శించుకున్నారు. సోమవారం అర్థరాత్రి నుంచి నగరంలో వర్షం ప్రారంభమైంది. అయితే ఆ వర్షంలోను భక్తులు ఆలయానికి చేరుకుని పొంగళ్ళు పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. కిలోమీటర్ల దూరమైన తమ ఇళ్ళ వద్ద నుంచి పొర్లు దండాలు పెట్టుకుంటూ ఆలయం వద్దకు కొందరు భక్తులు చేరుకుంటే, అమ్మవారికి మొక్కుక్కున మహిళలు వేపాకు చీరలతో ఆలయానికి చేరుకుని ఆ దేవత ఆనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే ఆలయం వద్ద పొంగళ్ళు పెట్టి అమ్మవారికి సమర్పించుకున్నారు. అలాగే గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు దబ్బలతో తయారుచేసి వాటిని శరరంపై నిలబెట్టుకోవడం కోసం బాధను భరించి నడుముకు గుచ్చుకుంటున్నా డబ్బుల మోతకు తగ్గట్టుగా చిందులవేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఇక యువకులు ఆడవేషాలతో నగరంలో సంచరిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. దీంతోపాటుగా నగరంలో పలువురు భక్తులు, సంస్థలు ప్రజలకు అంబళ్లు, మజ్జిగను పంపిణీ చేశారు.
గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనం...
తిరుపతి గంగ జాతరలో అంత్యంత కీలక ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం తెల్లవారుజామున తిలకించిన భక్త జనం భక్తి పారవశ్యంతో పులకించారు. 9 రోజుల గంగజాతరలో బుధవారం అత్యంత ప్రధాన ఘట్టం తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో జరిగింది. పాలేగాడిని సంహరించడానికి అవతరించిన గంగమ్మ దుష్ట సంహారానికి ముందు తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని భక్తుల నమ్మకం. అందుకే జాతర ముగిసిన తరువాత ఆలయంలోని స్థంభానికి బంకమన్నుతో అమ్మవారి శిరస్సును తయారు చేస్తారు. నల్లటి ఆకారంతో బంగారు కిరీటం, వెండి ముక్కర, చెవులు ఆభరణాలుగా ఉన్న అమ్మవారి రూపాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో రూపొందిస్తారు. అర్థరాత్రి నుంచి విశ్వరూపం తయారుచేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్థంబానికి ముందుగా ఎండుగడ్డిని చుట్టి దానిపై బంకమన్నుతో అమ్మవారి శిరస్సును తయారు చేస్తారు. తెల్లవారు జామున పేరంటాళ్లు వచ్చి విశ్వరూపానికి కర్పూర నీరజనాలు సమర్పించి, చెంపను తాకడానే్న చెంపనరకడంగా భావిస్తారు. దీంతో అప్పటి వరకు పూజలందుకున్న విశ్వరూపాన్ని చిధ్రం చేస్తారు. విశ్వరూపం తయారైన బంకమట్టిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి తమ ఇళ్ళకు తీసుకువెడతారు. గతంలో అమ్మవారి విశ్వరూపాన్ని పేరంటాళ్ళు రాకమునుపే భక్తుల దర్శనార్థ తెరతీసిన సందర్భంగా ఆలయానికి ఎదురుగా ఉన్న చెట్లు, ఇళ్లు దగ్ధమైనట్లు స్థానికులు చెబుతారు. దీంతో పేరంటాళ్లు రావడానికి కొన్ని క్షణాలముందే అమ్మవారి ముందున్న తెరతీసి భక్తులకు దర్శనం కల్పించి, వెంటనే చెంపనరకడంతో విశ్వరూప ప్రతిమను చెరిపేస్తారు. కాగా బంకమన్ను కోసం అర్థరాత్రి నుంచి భక్తులు ఆలయం ముందు వేచివున్నారు. విశ్వరూప ప్రతిమ మన్ను దొరికితే తమకు అమ్మ అనుగ్రహం లభించినట్లుగా భావిస్తారు. దీనికోసం మహిళలు, పురుషులు తీవ్రంగా పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. ఆ బంకమన్నును ఇంట్లో ఉంచుకుంటే భూత,ప్రేత పిశాచాల బెడద ఉండదని, ఎలాంటి ఆనారోగ్యాలు సంబవించవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాగా ఈ సమయంలో జరిగే తొక్కిసలాటను నియంత్రించడానికి పోలీసులు భారీగా మొహరించారు. అయితే సోమవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షం మంగళవారం రాత్రికి ఒక్కసారిగా ఎక్కువవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

*