చిత్తూరు

మిథున్ రెడ్డికి బెయిల్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 20 : రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజరు రాజశేఖర్ దాడి కేసులో నిందితుడైన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, వైసీపి నాయకుడు మధుసూదన్ రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ శ్రీకాళహస్తి 5వ అదనపు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ బుధవారం నాడు తీర్పునిచ్చారు. గత ఏడాది నవంబర్ 26న రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్‌పై దాడి చేసిన సంఘటనలో 19 మందిపై కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు విదితమే. ఇందులో 16 మంది స్వచ్చందంగా లొంగిపోయి బెయిల్ తీసుకున్నారు. ఎంపి పిఏ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ముందస్తు బెయిల్ పొందారు. ఇక మిధున్ రెడ్డి, మధుసూధన్ రెడ్డిలను పోలీసులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో వీరిరువురిపై గాజుల మండ్యం పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. దీంతో జైలులో ఉన్న వీరు బెయిల్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.