చిత్తూరు

హనుమంత వాహనంపై ఊరేగిన కోదండరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తవణంపల్లె, జూన్ 17: టి.పుత్తూరు కోదండరాముల వారి ఆలయంలో ఈనెల 14నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమంజనం, పాలాభిషేకం కార్యక్రమం జరుగగా సాయంత్రం స్వామివారిని ఊంజల్‌సేవ జరిగింది. రాత్రి అందంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై ఉంచిపురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు పలపుష్ప నారికేళ తాంబూలాది కర్పూర హారతులిచ్చి తీర్థ ప్రసాదాలను పొందారు. ఈకార్యక్రమాలకు ఉభయదారులుగా లోకనాధరెడ్డి, కృష్ణమనాయుడు, పరంధామరెడ్డి కుటుంబీకులు, హనుమంత వాహనానికి కృష్ణమాచార్యులు వగైరా, విశ్వబ్రాహ్మణ వగైరా, కోదండాచారి కుటుంబ సభ్యులు కాగా వంశపారం పర్య ధర్మకర్త సిద్దేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోబ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.