చిత్తూరు

విద్యార్థికి విద్యాభ్యాసమే బంగారు భవిషత్తుకు పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, జూన్ 17: ప్రతివిద్యార్థి విద్యార్థి దశలోనే కష్టపడి చదివితే బంగారు భవిషత్తుకు పునాది అని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. అనంతరం స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రి గంటాశ్రీనివాసరావు సందర్శించి విద్యార్థుల శిక్షణా తరగతులను పరిశీలించారు. మంగల్ విద్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇంతమంది విద్యార్థుల మధ్య మాట్లాడే అదృష్టాన్ని కల్పించిన గల్లా రామచంద్రనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోమంది పారిశ్రామిక వేత్తలను చూశాను గానీ గల్లా రామచంద్రనాయుడు లాంటి మహోన్నత వ్యక్తిని చూడలేదని కొనియాడారు. ఒక ప్రతిభావంతుడు అయిన వ్యక్తి సమాజానికి ఉపయోగపడుతాడని రామచంద్రనాయుడు నిరూపించారన్నారు. 1985వ సంవత్సరం పాఠశాలను ప్రారంభించి తన పట్టుదల, కృషితో అహర్నిశలు కష్టపడి ఎవరూ ఊహించని స్థాయిలో 16వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అమర్‌రాజా బ్యాటరీస్‌ను నెంబర్ వన్‌గా నిలబెట్టడం అందరికి గర్వకారణమన్నారు. మారుమూల పల్లెటూరులో అందరికి విద్యను అందించాలని జీవితాల్లో వెలుగులు నింపాలని, భవిష్యత్తులో గొప్పవారు కావాలనుకున్న వ్యక్తిని ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను పూజించడం ప్రతి విద్యార్థికి అవసరమన్నారు. మదర్‌థెరిస్సా స్పూర్తిని ప్రతివిద్యార్థి గుర్తించు కోవాలన్నారు. ప్రతి ఒక్కరు చెట్లనునాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రతిఒక్కరు సమాజసేవకు ఉపయోగపడాలన్నారు. అనంతరం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కష్టపడి చదివితే అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు. ఈకార్యక్రమంలో జడ్పి చైర్‌పర్శన్ గీర్వాణి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమర్‌రాజా బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, దుర్గారామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెసి వెంకటసుబ్బారెడ్డి, ఎంపిడిఒ శ్రీదేవి, తహశీల్దార్ రమేష్, ఎఎంసి చైర్మన్ జయచంద్రనాయుడు, సీతాపతినాయుడు, హిమగిరినాయుడు, ఉపాధ్యాయులు ధనంజయ నాయుడు, సూర్యప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.