చిత్తూరు

నగర అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 17: తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇందుకు ప్రజలు సహకరించాలని కమీషనర్ వినయ్‌చంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయల్‌చెరువు రోడ్డు వెడల్పు చేయడం, సుందరీకరణ అలాగే లక్ష్మీపురం సర్కిల్‌లో కల్వర్టు పనులు, ఎమ్మార్ పల్లిలో రాములవారి గుడి, ఎల్.ఎస్.వినగర్ 2వ లైనులో కాలువ నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. టీచర్ల కాలనీలో డబ్ల్యూ.బి.ఎం. రోడ్డు, తిరుచానూరు రోడ్డులో యుడిఎస్ మరమ్మతు పనులు, లీలామహల్ పంప్ హౌస్ నుంచి నగరపాలక సంస్థలోని పంప్‌హౌస్ వరకు పైప్‌లైన్ వేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈపైప్‌లైన్ వేయడం ద్వారా పెద్దకాపులే ఔట్, పెద్దకాపు వీధి, చిన్నకాపు వీధి, జబ్బార్ లే ఔట్, అశోక్‌నగర్, కొర్లగుంట, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ పరిసర ప్రాంతాలకు తెలుగుగంగ నీటిని సంమృద్ధిగా సరఫరా చేయవచ్చని వివరించారు. అలాగే నగరంలోని 2,4 డివిజన్లలో జరుగుతున్న కాలువ నిర్మాణం పనులు వేగవంతం చేసే లక్ష్యంతో ఆరోగ్య సిబ్బందికి బయోమెట్రిక్ మెషిన్ ద్వారా హాజరుశాతాన్ని నమోదు చేయడం జరుగుతోందని వివరించారు. పాడిపేట వద్ద 3360 ఇళ్ల నిర్మాణం పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు కూడా పంపడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు. ఈపరిస్థితుల్లో ప్రజలు సకాలంలో ఆస్తి పన్నును చెల్లించాలని కోరారు. 2016-17 సంవత్సరం మొదటి, రెండవ అర్థ సంవత్సరం ఇంటి పన్నులను ఈనెల 30వ తేదీలోపు వడ్డీలేకుండా చెల్లించాలని కోరారు. ఆదివారం కూడా ఆస్తి పన్ను చెల్లించేందుకు అనుకూలంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నగరంలోని 300 గజాలు పైబడిన గృహ, ఫ్యాక్టరీ, స్కూల్, కాలేజీ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఆలయాలు, సముదాయాల యజమానులు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు.