చిత్తూరు

‘ఆధునిక పద్ధతిలో పశుగణన జరగాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 17: దేశంలోని పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలంటే శాస్ర్తియ పద్ధతిలో పశుగణన జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర గణాంఖాల కార్యదర్శి టిసిఎం అనంత్ అన్నారు. తిరుచానూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం పశుగణాంకాల సేకరణపై వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో సైతం అభివృద్ధి సాధించాలని చెప్పారు. ఇందుకోసం చేస్తున్న గణాంకాల్లో శాస్ర్తియత లోపించిందని వివరించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.