చిత్తూరు

వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులను విద్యార్థులు అర్ధం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 17: ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశంలోని వ్యవసాయ రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దీనిని వ్యవసాయ విద్యార్థులు అర్థం చేసుకోవడంతోపాటు సద్వినియోగం చేసుకోవాలని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పిజి స్టడీస్ డీన్ డాక్టర్ ఆర్ వీరరాఘవయ్య అన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అగ్రిబిజెనెస్ పి జి విద్యార్థులకు ఒక్కరోజు అనుసంధాన కార్యక్రమం జరిగింది. ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఇన్సిట్యూట్ ఆఫ్ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ, ఆర్ ఏ ఆర్ ఎస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఎలాంటి మార్పులకు నోచుకోని వ్యవసాయ రంగం నేడు అనూహ్య పరిణామాలకు వేదికగా మారుతోందని అన్నారు. వ్యవసాయ, వ్యవసాయాధారిత రంగాల్లో వస్తున్న మార్పులతో ప్రపంచ దేశాల సరసన భారత్ కూడా చోటు సాధించిందని చెప్పారు. నూతన మార్పులతో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. వీటిని విద్యార్థులు అందిపుచ్చు కోవాలని కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడు మురళీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ విశ్వ విద్యాలయ అనుసంధానం అత్యంత అవసరమని చెప్పారు. డాక్టర్ రమేశ్ బాబు మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశ్రమలు పరస్పర అవగాహనతో కలసి పనిచేసినప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఇన్సిట్యూట్ ఆఫ్ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్, పాలక వర్గ సభ్యులు భవానీ దేవి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరిశ్రమల నుంచి ఏమి కావాలి, అలాగే పరిశ్రమలకు విద్యార్థుల నుంచి ఏమి ఆశిస్త్తున్నాయో అవగాహన కల్పించేందుకే ఈకార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. ఈసమావేశంలో అసోసియేట్ డీన్ డాక్టర్ వి.రాజేశ్వరి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ టి సి ఎం నాయుడు, అసోసియేట్ ప్రొఫెసర్ వై.ప్రభావతి, అలాగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన టాటా కెమికల్స్, ఆడ్మా ఇండ్రస్ట్రీస్, రాసి నీడ్స్, జ్యూరి ఆగ్రో కెమికల్స్, వర్ష ఫుడ్స్ సంస్థలు పాల్గొన్నాయి.