చిత్తూరు

తిరుమల బాలాజీ నగర్‌లో రాత్రిపూట చిరుత హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 17: తిరుమలలోని బాలాజీ నగర్‌లో ప్రతి రోజూ రాత్రి చిరుతపులి సంచరిస్తూ హల్‌చల్ చేస్తోంది. స్థానిక బాలాజీనగర్ ప్రాంతం, దీనికి సమీపాన ఉండే ప్రైవేట్ మఠాల వద్దకు గత కొద్ది రోజులుగా చిరుత తచ్చాడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ అర్థరాత్రి వేళలో చిరుతపులి సమీప అటవీప్రాంతం నుంచి నివాసాల వెనుక వైపున్న పొదలలోకి చేరుకుని వేటాడేందుకు ఎదురుచూస్తోంది. రాత్రి వేళలో దుకాణాలను మూసుకుని స్థానికులు నివాసాలకు వెళ్లే సమయంలో ఈ చిరుతపులి వారి కంటపడుతోంది. వెంటనే వారు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లతో చిరుత ఫోటీలు తీస్తున్నారు. ఈ సమయంలో చిరుత ఏమాత్రం జంకకుండా ఉండటం గమనార్హం. దీంతో స్థానికులు రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా దీనిని బంధించి దూరంగా వదలిపెట్టాలని కోరుతున్నారు.