చిత్తూరు

తిరుమలలో ఘనంగా శ్రీవారి జ్యేష్ఠ్భాషేకం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 17: శ్రీవారి ఆలయంలో స్వామివారి జ్యేష్ఠ్భాషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేటట్లుగా మూడు రోజులపాటు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈకార్యక్రమం నిర్వహిస్తారు. దీనినే అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య శ్రీ మలయప్ప స్వామి వారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాదులు నిర్వహించారు. సహస్ర కలశాభిషేకం అనంతరం శ్రీ మలయప్ప స్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీనమైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం టిటిడి ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిజపాద దర్శనం, వసంతోత్సవ సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్న జీయర్ స్వాములు, ఇ ఒ సాంబశివరావు, జె ఇ ఒ పోలభాస్కర్, శ్రీవారి ఆలయ డిప్యూటి ఇ ఒ కోదండరామారావు పాల్గొన్నారు.