చిత్తూరు

కుల రాజకీయాలు చేయకుండా అభివృద్ధి చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెదురుకుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేయకుండా రాష్ట్రంలో అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు నారాయణ స్వామి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు ఎస్సీల మధ్య, నేడు బిసీల మధ్య చిచ్చుపెట్టి ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామల్లోని రైతాంగం తాము పండించిన పంటలకు మద్దతు ధర లేక ఇబ్బందులకు గురవుతుంటే చంద్రబాబు కులాల రాజకీయాలతో కాలయాపన చేయడం సరికాదన్నారు. జిల్లాలోని రైతాంగం విరివిగా చెరకు సాగు చేస్తున్నారని అర్ధాంతరంగా చక్కెర కర్మాగారిన్ని మూసివేయడం వలన జిల్లాలోని రైతాంగం ఆందోళన చెందుతున్నారన్నారు. చెరకు రైతులు కర్మాగారాలను తెరిపించాని పలు పర్యాయములు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శన మన్నారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ సక్రమంగా అమలు జరపకపోవడం వల్ల రైతులు బ్యాంకుల వైపు వెళ్లడం మానేశారన్నారు. రైతులు వ్యవసాయ సాగుబడికి అదనపురుణాలు సైతం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతు సంఘ నేతలు పలు పర్యాయములు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన నీరు-మీరు కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నేతలు కోట్లాది రూపాయలను దోచుకోవడం జరిగిందన్నారు. జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గ్రామాలలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. స్థానికంగా ఉన్న సర్పంచులను , ఎంపిటిసిలను, అధికారులను, సంక్షేమ పథకాల అమలులో భాగస్వాములు చేయకుండా జన్మభూమికమిటీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలను సక్రమంగా అందించేలా చర్యలుచేపట్టాలని డిమాండ్‌చేశారు. విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు అందించకపోవడం వల్ల వారు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా హామీ లిచ్చి నేడు వాటి పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వందలాది మంది చాలీ చాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని, కనీస వేతన చట్టాన్ని అమలు పరిచి పనికి తగిన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి మాధవరావు, ఎంపిపి పురుషోత్తం, వైఎస్‌ఆర్ సిపి అధ్యక్షులు ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పన్ను బకాయిలు నూరు శాతం వసూలు చేయండి
* అధికారులకు కమిషనర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 6: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి, కుళాయి, యుడిసి పన్నులతో పాటు వాణిజ్య లైసెన్సులను నూరు శాతం వసూలు చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని నగర పాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో ఆయన మున్సిపల్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రతి వార్డును అధికారులు పరిశీలించి కొత్తగా నిర్మించిన భవనాలను గుర్తించి వాటికి నిబంధనల ప్రకారం నిర్దేశించవలసిన పన్నులను యజమానుల నుండి వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే సినిమా థియేటర్లు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లలో కూడా పన్నులు బకాయిలు లేకుండా వసూలు చేయాలని లేని పక్షంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎం శ్రీదేవి, ఉపకమిషనర్ కె భాగ్యలక్ష్మి, అకౌంటెంట్ వి ఎస్ చిట్టిబాబు, మున్సిపల్ ఇంజనీర్ పి సత్యనారాయణ, బి చంద్రశేఖర్, వెంకట ప్రసాద్, శ్రీ్ధర్, కె సుబ్బరాయుడు, రెవిన్యూ ఆఫీసర్ ఎన్ సేతూమాధవ్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి నగరంలో రోడ్లకు ఇరువైపులా పుట్ పాత్‌లను దుకాణాదారులు, భవన యజమానులు ఆక్రమించుకోవడంతో పాదాచారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నదని కమిషనర్ వినయ్ చంద్ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో వాటిని స్వచ్చందంగా తొలగించమని వారికి చెప్పాలని కాని పక్షంలో నగర పాలక సంస్థ తొలగించి వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని ఆయన ఆదేశించారు.
భక్తులతో కిట కిటలాడిన శ్రీ కాళహస్తీశ్వరాలయం
* శనిత్రయోదశి సందర్భంగా పెరిగిన రద్దీ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 6: శ్రీ కాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. సాధారణంగా శని ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే శనివారం త్రయోదశి కలిసి రావడంతో రద్దీ మరింత పెరిగింది. స్థానికులే కాకుండా తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో ఉదయం నుంచే ఆలయం భక్తులతో నిండిపోయింది. సాధారణ క్యూలు, ప్రత్యేక క్యూలు నిండిపోవడంతో సిబ్బంది అదనపు క్యూలైన్లను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 1 గంటకు రద్దీ కొంత మేరకు తగ్గినా 3 గంటల తరువాత తిరిగి పెరిగింది. ఉదయం రాహుకాలం సమయంలో ఎక్కువ మంది రాహు-కేతు పూజలు చేయించుకున్నారు. మధ్యాహ్నానికే 2000 రాహు-కేతు పూజలు జరిగాయి. అదేవిధంగా శని త్రయోదశి కావడంతో మధ్యాహ్నానికే 500 టిక్కెట్లు విక్రయించారు. ఉదయం రాహుకాలం సమయంలో శనేశ్వర అభిషేకం చేయించుకోవడానికి భక్తులు పోటీలు పడ్డారు. ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు కూడా అదే సమయంలో శనేశ్వర అభిషేకానికి వచ్చారు. దీంతో భక్తులకు అవస్థలు తప్పలేదు. స్థలం చిన్నదికావడంతో ఎక్కువ మంది భక్తులు కూర్చోవడానికి వీల్లేకుండా పోయింది. సాయంత్రం కూడా శనేశ్వర అభిషేకానికి రద్దీ ఏర్పడింది.
మధ్యాహ్నానికి 30 వేల మంది దర్శనం
రద్దీ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తడంతో దేవస్థానం సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికే సుమారు 30వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సోమవారం అమావాస్య కావడంతో ఆరోజు కూడా రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో కార్యాలయం సిబ్బంది కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు త్వరగా స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించాలని ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు సిబ్బందికి సూచించారు. క్యూలైన్లను పరిశీలించి భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. సిబ్బందిని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
నేడు జాతీయ బాలల రక్షణ కమిటీ తిరుపతి రాక
తిరుపతి, ఫిబ్రవరి 6: ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈనెల 24వ తేదీన జాతీయ బాలల రక్షణ అనే అంశంపై జాతీయస్థాయి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో వాటి ఏర్పాట్లను పరిశీలించేందుకు బాలల రక్షణ కమిటీ సభ్యులు ప్రియాంక కన్నోంగో ఆదివారం తిరుపతిలో ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
ఈసందర్భంగా ఆమె విద్యాశాఖ అధికారులతో సమావేశమై తిరిగి చెన్నయ్ వెడతారు.
హంద్రీ-నీవా పనులు ప్రారంభం
బైరెడ్డిపల్లె, ఫిబ్రవరి 6: మండలంలో హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణపు పనులను శనివారం రైతులు పూజలతో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని పెద్దచల్లారుగుంట 11వ కిలోమీటరు వద్ద రెండు యంత్రాలతో, గొల్లచీమనపల్లి 16కిలోమీటరు వద్ద రెండు యంత్రాలతో కాలువ పనులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో రైతులు స్వచ్చందంగా హాజరై యంత్రాలకు పూజలు చేపట్టి పనులను చేయించడం కాంట్రాక్టర్లకు ఊరట కలిగించింది. తమ పొలాల్లోని ఉద్యాన పంటలను పరిశీలించడానికి ఉద్యానశాఖ అధికారులు రాకపోవడం రైతులను నిరాశ పరచింది. అలాగే ఈకార్యక్రమంలో ఆర్‌కె ఇన్ఫాఅండ్ హెచ్‌ఎఇసి కోయాజెవి కంపెనీలు పనులను చేపడుతున్నది. హంద్రీ-నీవా కాలువ మండలంలో 21 కిలోమీటర్లు కొనసాగనున్నది.

రాయలసీమ అభివృద్ధి బస్సు జాతా జయప్రదం చేయాలి
* సిపిఎం, సిపిఐ పిలుపు
తిరుపతి, ఫిబ్రవరి 6 : వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ఈ నెల 22, 23 తేదీలలో జరిగే బస్సు జాతాను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమలో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బస్సు జాతాలను నిర్వహించడంపై శనివారం వామపక్ష నేతలు బైరాగిపట్టెడలోని సిపిఎం కార్యాలయంలో సమాలోచన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమ రోజు రోజుకు ఎడారిగా మారుతుందన్నారు. సీమకు చెందిన వారు ఎక్కువగా ముఖ్యమంత్రి స్థానాల్లో పని చేసిన ఏ ఒక్కరూ కూడా సీమ గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే రాయలసీమ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే రాయలసీమ ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ నెల 22 నుంచి 23వ తేదీ వరకు జిల్లా మొత్తం తిరుగుతూ ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. తద్వారా పాలకుల దుర్ణీతిని ప్రజలకు తెలియజేసి భవిష్యత్తులో ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ జాతాలో తొలిరోజు తిరుపతిలో జరిగే బహిరంగ సభలో సిపియం నాయకులు సీతారామ ఏచూరి, సిపి ఐ నాయకుడు డా. కె నారాయణ పాల్గొంటారన్నారు. ఈ సభలకు ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపి ఐ నాయకులు వెంకటరత్నం, ఆర్ హరికృష్ణ, చిన్నం పెంచలయ్య, పి మురళి, రాధాకృష్ణ, ఎన్ డి రవి, ఎన్ శ్రీరాములు, శశి, రామచంద్రయ్య, సిపియం నాయకులు వి నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, జయచంద్ర, యాదగిరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘నేషనల్ మజ్దూర్
యూనియన్‌ను గెలిపించండి’
పీలేరు, ఫిబ్రవరి 6: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్‌ను గెలిపించాలని రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య అన్నారు. శనివారం పీలేరు ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ అధికారంలోకి రాగానే కార్మికులపై పెంచిన పనిభారాన్ని తగ్గించడం, సమైక్యాంధ్ర 60 రోజుల సమ్మెకాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవుగా ఇప్పించడం 2017లో గణనీయమైన పే స్కేల్, అలవెన్సులు ఇప్పించడం తదితర అనే క డిమాండ్లు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈనెల 18 వ తేదీన జరిగే ఎన్నికల్లో తమ కాగడ గుర్తుపై తమ ఓటునువేసి గెలిపించాలని ఆయన కార్మికులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, కార్యదర్శి ఆవుల ప్రభాకర్,రాష్ట్ర కార్యదర్శులు బాబు, వెంకటేశ్వర, రమణారావు, డిపో కార్యదర్శి నాగరాజు, అర్జున్, మోహన్‌రెడ్డి, జనార్థన్, ధనశేఖర్, సుబ్బరామయ్య, ప్రమీల పాల్గొన్నారు.
36లక్షల విలువైన
ఎర్రచందనం, వాహనాలు సీజ్
రేణిగుంట, ఫిబ్రవరి 6, రేణిగుంట మండలంలో 30 లక్షలు, పీలేరు మండలంలో 6 లక్షల విలువైన ఎర్రచందనం, వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. గుండాలకాల్వ వద్ద అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలను ఎస్ ఐ మధుసూదన్ శనివారం ఉదయం పట్టుకున్నారు. ఈసందర్భంగా ఎర్రచందనం తరలించడానికి వినియోగించిన సవేరా వాహనాన్ని, ఏడుగురు కూలీలను పట్టుకున్నారు. డిఎస్పీ నంజుండప్ప కథనం మేరకు తమకు అందిన రహస్య సమాచారం మేరకు ఎస్ ఐ మధుసూదన్, రఫీ తమ సిబ్బందితో వెళ్లి దాడిచేసి పట్టుకున్నటుల డిఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఈ సమావేశంలో సిఐ బాలయ్య పాల్గొన్నారు.
పీలేరులో
పీలేరు: మహేంద్ర స్కార్పియోలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుండగా శనివారం డిఎఫ్‌ఓ నాగార్జున రావు ఆధ్వర్యంలో దాడిచేసి పట్టుకున్నారు. ఈసందర్భంగా 129 కేజీల బరువు కలిగిన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. వీటి విలువ రూ.6లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కలకడ - వాయల్పాడు రహదారిలో తనిఖీలు చేస్తుండగా స్కార్పియో వాహనం వేగంగా వెళ్లడంతో వెంటాడి పట్టుకున్నట్లు నాగార్జున తెలిపారు. ఈదాడుల్లో సిబ్బంది కరణ్ సింగ్, సుకుమార్, బావాజాన్, బాలాజీ పాల్గొన్నారు.
వ్యవసాయ పరిశోధన స్థానం
అసోసియేట్ డైరెక్టర్‌గా డాక్టర్ టిసిఎం నాయుడు
తిరుపతి, ఫిబ్రవరి 6 : తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నూతన సహ పరిశోధన సంచాలకులుగా డాక్టర్ టిసిఎం నాయుడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గుంటూరు ప్రాంతీయ పరిశోధన స్థానంలో మొక్కల శరీర ధర్మశాస్త్రం విభాగంలో ప్రధాన శాస్తవ్రేత్తగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. 1983 సంవత్సరంలో మొదటగా వ్యవసాయ వర్శిటీలో శాస్తవ్రేత్తగా సత్తుపల్లి, గరికపాడు ప్రాంతాల్లో 16 సంవత్సరాలు విధులు నిర్వహించారు. అలాగే బోధనలో బాసట్ల, అశ్వరావుపేటలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా 17 సంవత్సరాలు విధులు నిర్వహించారు. 2010లో అమెరికాలో 6 మాసాలు మొక్కల శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన విభాగంలో పని చేశారు. ఆయన విశేష అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని తిరుపతిలో సహ పరిశోధన సంచాలకులుగా ప్రభుత్వం నియమించినట్లు సీనియర్ శాస్తవ్రేత్త డాక్టర్ ఏ రామకృష్ణారావు తెలిపారు.
పుత్తూరులో రోడ్డు ప్రమాదం: ఒకరికి తీవ్రగాయాలు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 6: పుత్తూరులో ఓ జ్యూస్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించుకుని తిరిగి వెళుతున్న ఓ వ్యక్తిని మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి వాహనాన్ని వేగంగా నడిపి ఢీకొనడంతో గాయపడ్డ సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వైజాగ్‌కు చెందిన శ్రీనివాసులు బతుకు జీవనం కోసం పుత్తూరులోని ఓ జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు నిర్వహించుకొని తన సహచరులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో నగరిలో వ్యాపారం చేసుకుంటున్న ఎంఎస్‌ఆర్ బాబు (45) అనే వ్యక్తి మద్యం సేవించి రోడ్లో చివరగా వెళుతున్న శ్రీనివాసులు ఢీకొన్నాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడుని సహచరుడు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చెవిలో రక్తం రావడంతో పరిస్థితి విషమించింది. దీంతో శ్రీనివాసులను మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా సమాచారం తెలుసుకున్న పుత్తూరు ఎస్‌ఐ హనుమంతప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పుత్తూరు మరాఠీ గేటువద్ద కుక్కలు అడ్డురావడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న చిన్నప్పనాయుడు (50), మొరిగేషన్ (60) అనే గాయపడ్డ సంఘటన కూడా శనివారం రాత్రి జరిగింది. అయితే బాధితులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
పోస్టుకార్డుల ఉద్యమాన్ని జయప్రదం చేయండి
పోస్టుకార్డుల ఉద్యమాన్ని జయప్రదం చేయండి చిత్తూరు, ఫిబ్రవరి 6: కొత్త పెన్షన్ విధానం (కాంట్రిబ్యూటరి పెన్షన్ పథకం)ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలంటూ ఆదివారం చిత్తూరు నగరంలో చేపట్టనున్న పోస్టుకార్డుల ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ బాబు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో సంఘం నేతలు విలేఖరులతో మాట్లాడారు. బాబు మాట్లాడుతూ సాధారణ వ్యక్తి మరణిస్తేప్రభుత్వం రూ 5 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ చనిపోయిన వారికి ప్రభుత్వం దహనక్రియలకు గాను అరకొర నిధులను కేటాయించి సరిపోనిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 నుంచి 18 మంది నూతన పెన్షన్ ఉద్యోగులు మరణించారని, వారికి ఇప్పటి వరకు రావాల్సిన మొత్తాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడ్డారని వివరించారు. తమ సమస్యలను ప్రధాన మంత్రి నరేంద్రమోదికి తెలియజేసేందుకే పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని పోస్టుకార్డుల ద్వారా తమ వాణిని ప్రధానికి వినిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి టి వెంకటరమణ, సభ్యులు మధు, ఖాదర్‌బాష, బాబు, కుమార్, సురేష్, శ్రీలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు.

ఆర్టీసీ ఎన్నికల్లో కార్మిక పరిషత్ సంఘం విజయానికి కృషి చేయాలి
* ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 6: ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో టిఎన్‌టియుసి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు చర్యలు చేపట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్ టియుసి సంఘ నేతలతో ఆయన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 14డిపో పరిధిలో కార్మిక పరిషత్ విజయం సాధించే దిశగా టిఎన్‌టియుసి నేతలు కృషి చేయాలన్నారు. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపిస్తున్నారని, రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికి ఆర్టీసీ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ కార్మికులు కార్మిక పరిషత్ పట్ల మక్కువ చూపే విధంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి బిఎన్ రాజసింహులు, దేశం నేతలు కుతూహలమ్మ, లలిత కుమారి, టిఎన్‌టియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నందగోపాల్, ప్రకాష్, రవి, ఆర్టీసీ సంఘ నేతలు కేశవులు, కుమార్, రవికుమార్, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.