చిత్తూరు

ఎర్రచందనం దొంగ రవాణాకు సహకరిస్తే కఠిన శిక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 2: ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాలో సహకరించిన వారికి, పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు తప్పవని ఆ దిశగా చట్టాలు రూపొందించడం జరిగిందని, వీటిపై ప్రతి అధికారి అవగాహన పెంచుకోవాలని రాయలసీమ డి ఐజి ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మిలు అన్నారు. సవరించిన ఎర్రచందనం అక్రమరవాణాల చట్టాలపై పోలీస్, అటవీశాఖ అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమం శనివారం స్థానిక మహిళా విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డి ఐజి ప్రభాకర్ మాట్లాడుతూ తాజా చట్టాలపై ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని, అంతేకాకుండా వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణలో పోలీసులు, అటవీశాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే సవరించిన చట్టాలు, వాటి విధి విధానాలను ఆయన సవివరంగా తెలిపారు. అర్బన్ ఎస్పీ ఆర్. జయలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన చట్టంలో ఉన్న లోటుపాట్లను గుర్తించి నేడు తయారుచేసిన చట్టం అత్యంత కఠినంగా ఉందన్నారు. ఈ చట్టం గురించి పోలీసులు, అటవీశాఖాధికారులే కాకుండా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే కొత్తచట్టంలో ఎర్రచందనం స్మగ్లర్లకే కాకుండా చెట్లు నరుకుతున్నవారికి, వారికి పైలెట్‌గా వ్యవహరించిన వారికి, సమాచారం అందించిన వారికి, వాహనాలు నడిపేవారికి ఆ వాహన యజమానులకు కూడా కఠిన శిక్షలు తప్పవన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారి చలపతి రావు, బి ఎన్ ఎన్ మూర్తి, టివి సుబ్బారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్‌ఆర్‌ఏ రోజ్‌ధర్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ స్వామి, ఎ ఎస్పీ త్రిమూర్తులు, డి ఎస్పీలు, సి ఐ లు, అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
గంగవరం, జూలై 2: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మబ్బువాళ్లపేట క్రాస్‌వద్ద శనివారం చోటుచేసుకుంది. గంగవరం మండల ఎస్సై దిలీప్‌కుమార్ కథనం మేరకు పుంగనూరు పరిధిలోని కొత్త ఇండ్లు గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ (28), అనిల్‌కుమార్(26)లు ద్విచక్రవాహనంలో పలమనేరు వైపు వస్తున్నారు. అదేమార్గం 219జాతీయ రహదారిలో వస్తున్న బొలెరో వాహనం వీరు వస్తున్న ద్విచక్రవాహనాన్ని మబ్బువాళ్లపేట క్రాస్‌వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృత దేహాలను శవ పరీక్ష నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు బొలెరో వాహన డ్రైవర్‌పై గంగవరం ఎస్సై దిలీప్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.