చిత్తూరు

ఆల్-ఉమా తీవ్రవాదుల కోసం ముమ్మర గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 2 : చిత్తూరు కోర్టు ఆవరణలో చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటనలో ఆల్-ఉమా తీవ్రవాద సంస్థ ప్రమేయం ఉందని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ సంస్థ నాయకుడు సిద్దిక్ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు సరిహద్దులోని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇటీవల కేరళ కొల్లం కోర్టులోనూ, తమిళనాడు ఇదే తరహాలో బాంబు పేలుడు జరగడం విదితమే.ఈ నేపథ్యంలో తీవ్రవాదుల భరతం పట్టాలన్న కేంద్ర హోం శాఖ తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ధ్రాకారులను ఆదేశించింది. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఆయా రాష్ట్రాల సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు, కూంబింగ్‌లు చేపట్టాలని ఆదేశించింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి తీవ్రవాదులు జిల్లాకువచ్చే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నేపథ్యంలో భారీ పోలీసు బలగాలు జాతీయ రహదారితో పాటు, అటవీ ప్రాంతాల్లోనూ జల్లెడ పడుతున్నాయి.

నా భార్యను కిడ్నాప్ చేశారు
* పోలీసులకు భర్త ఫిర్యాదు

రేణిగుంట, జూలై 2: తాము ప్రేమవివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తన భార్య లావణ్య(20)ను ఆమె తండ్రి ప్రభాకర్ రెడ్డి, బంధువులు మురళి, రాజేష్‌లు, శీను, భాస్కర్ కిడ్నాప్ చేశారని ఆటోమెబైల్ షాపు నడుపుకుంటున్న హరీష్ శనివారం రేణిగుంట పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రేణిగుంట మండలం దొడ్లమిట్లలో నివాసముంటున్న లావణ్య ఎంబిబిఎస్ రెండో సంవత్సరం కడప రిమ్స్ కాలేజిలో చదువుతోంది. కరకంబాడికి చెందిన హరీష్ ఎంబిఎ పూర్తిచేసి రేణిగుంటలో ఆటోమొబైల్ దుకాణం నడుపుతున్నాడు. 10వ తరగతి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న లావణ్య కుటుంబ సభ్యులు ఆమెను హెచ్చరించారు. ఈ క్రమంలో గత 3 నెలల క్రితం లావణ్య, హరీష్‌లు హైదరాబాద్‌కు పారిపోయి ఆలయంలో వివాహం చేసుకుని తిరిగి వచ్చారు. దీంతో ఆగ్రహించిన లావణ్య తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రావద్దంటూ లక్ష్మణ రేఖను గీశారు. దీంతో లావణ్య కడపలో అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటూ చదువుకుంటోంది. హరీష్ ఆమె వద్దకు తరచూ వెళ్లి వస్తుంటాడు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు లావణ్య తండ్రి ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రెండు వాహనాల్లో కడపకు వెళ్లి లావణ్యను తీసుకెళ్లారు. ఈ సమయంలో అక్కడే ఉన్న తనపై కూడా దాడిచేసి వాహనంలో తీసుకువెళ్లి మామండూరు అడవీప్రాంతంలో రోడ్డుపక్కన పడవేసి వెళ్లారని హరీష్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. స్పృహ నుంచి కోలుకున్న తరువాత తాను అటవీప్రాంతంలో ఉన్నానని గుర్తించానన్నారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న ఎ టి ఎం కార్డు, సెల్‌ఫోన్‌ను లాక్కెల్లారని తెలిపారు. అనంతరం హరీష్ విలేఖరులతో మాట్లాడుతూ తనభార్య లావణ్యను చిత్రహింసలు పెడుతున్నట్లు ఆమె తరపు బంధువులే తన