చిత్తూరు

నేటి నుంచి నారాయణ వనం శ్రీ పరాశరేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 2: టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాసరేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. శనివారం సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 3వ తేదీ ఉదయం 9నుంచి 10 గంటల వరకు సింహలగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వాహనసేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఈనెల 9వ తేదీన రథోత్సవం జరుగనుంది. 10వ తేదీన రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, అనంతరం అశ్వ వాహనసేవలు నిర్వహించనున్నారు. 11వ తేదీ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నటరాజస్వామి ఉత్సవం, సాయంత్రం రావణేశ్వర వాహనసేవ జరుగనున్నాయి. 12వ తేదీన ఉదయం త్రిశూల స్నానం నిర్వహించనున్నారు.సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 10న నిర్వహించనున్న అర్జిత కల్యాణోత్సవంలో 500 రూపాయలు చెల్లించి గృహస్తులు ( ఇద్దరు) పాల్గొనవచ్చు. ఈ ఉత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

4 నుంచి 13 వరకు పెరియాళ్వార్ ఉత్సవం

తిరుపతి, జూలై 2: స్థానిక గోవిందరాజ స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గల పెరియాళ్వార్ వారి ఉత్సవం ఈనెల 4 నుంచి 13 వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు.