చిత్తూరు

మెరుగైన వైద్యం కోసం నగరి మునిసిపల్ చైర్మన్ చెన్నై తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 4: రంజాన్ తోఫా పంపిణీలో ప్రొటోకాల్‌ను విస్మరించడంపై టిడిపి నేతలతో వైకాపా నేతలు వాగ్వివాదానికి దిగిన నేపథ్యంలో టిడిపి కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ నగిరి మునిసిపల్ చైర్మన్ శాంతాకుమారిని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. ఆదివారం వైకాపా, టిడిపి నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో శాంతాకుమారితో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా గాయాలకు గురైన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో ఆమెకు రుయాలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను చెన్నై ఆసుపత్రికి తరలించాలని డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు ప్రత్యేక వాహనంలో సోమవారం చెన్నై అపోలోకి తీసుకున్నారు. వైకాపాకు చెందిన మునిసిపల్ చైర్మన్ శాంతాకుమారి గాయపడ్డ సమాచారం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం రుయాలో ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఓ పథకం ప్రకారమే వైకాపా నేతలపైన, కార్యకర్తలపైన టిడిపి నేతలు డాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో దాడులు పెరిగిపోయాయన్నారు. ఒక మునిసిపల్ చైర్మన్‌ను, అందులో ఒక మహిళా చైర్మన్‌పై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేశారంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉంటే తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారని, ప్రజలు వీరి ఆగడాలను ఇప్పటికే గుర్తించారని, తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా నగరికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ చైర్‌పర్సన్ శాంతాకుమారిపై టిడిపి నాయకులు విచక్షణారహితంగా దాడులు చేశారన్నారు. దుర్భాషలాడుతూ ఆమెను మోకాళ్లతో కడపులో బలంగా పొడిచారని, దీంతో ఆమె స్పృహ కోల్పోయారన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని శాంతాకుమారి డిమాండ్ చేస్తున్నారు.