చిత్తూరు

మెప్మా పిఆర్‌పిని సస్పెండ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 4: తన అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారంటూ ఆగ్రహించిన మదనపల్లె మున్సిపల్ మెప్మా ప్రాజెక్టులో పనిచేస్తున్న పిఆర్‌పి అదే సంస్థలో పనిచేస్తున్న సిఓ కుటుంబంపై అర్ధరాత్రి దాడికి పాల్పడిన పిఆర్‌పి ఉమేష్‌రావును వెంటనే సస్పెండ్ చేయాలని సోమవారం పట్టణ మహిళా సంఘాలు, సమాఖ్య లీడర్లు, దళిత, గిరిజన ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టి మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేధిస్తామని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా అధికసంఖ్యలో పాల్గొన్న మహిళ సంఘాల సభ్యులు పిఆర్‌పి ఉమేష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి టౌన్‌బ్యాంకు సర్కిల్, చిత్తూరు బస్టాండు వాల్మీకి సర్కిల్, గాంధీ రోడ్డుమీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ముంబై-చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసుల చొరవతో సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో సబ్‌కలెక్టర్ కృతికబాత్ర మదనపల్లె మున్సిపల్ మెప్మా పిఆర్‌పి ఉమేష్‌రావు చేస్తున్న అవినీతి అక్రమాలకు ఒత్తాసు పలకలేదని అనేక మంది మహిళలను బెదిరించడం, లేకుండా లైంగికదాడులతోపాటు ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నారని, ఇటీవల సుమారు 45గ్రూపులు బినామీలు సృష్టించి సుమారు రూ.3కోట్లు స్వాహా చేశారని, దీనిపై సిఓలుగా ఉన్న ఐదుగురిపై ఒత్తిడి చేస్తు వెంటనే రాజీనామాలు చేయాలని, లేకుంటే రూ.3కోట్లు చెల్లించాలని బెదిరిస్తున్నారని సబ్‌కలెక్టర్‌కు దళిత, గిరిజన ప్రజాసంఘాలు, మహిళలు, మహిళా సమాఖ్యలు ఫిర్యాదు చేశారు. నెలరోజుల కితం రూ.25లక్షలు అవినీతి అక్రమాలకు పాల్పడి మహిళా గ్రూపుసంఘాల రుణాలు సైతం స్వాహా చేయడం, దీంతో బ్యాంకు అధికారులు మహిళల వద్దకు రుణాలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంపై జిల్లాకలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతో ఆ మహిళా సంఘాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వేధింపులకు గురిచేస్తు దాడులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈకార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్ పట్టణ సమాఖ్య లీడర్లు, మహిళాసంఘాల సభ్యులు, వైఎస్సార్‌సిపి నాయకురాలు రోలింగ్‌మల్లిక, సిపిఐ నాయకులు క్రిష్ణప్ప, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు, జిల్లా ప్రధానకార్యదర్శి ఆరేటివాసు, కోపూరి మనోహర్, బాస్ రాష్ట్ర కన్వీనర్ పిటిఎం శివప్రసాద్, గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు నాగూనాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివాకర్‌రావు, అధికసంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు.