చిత్తూరు

పార్టీ పటిష్టతకు కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 25 : జిల్లాలో పార్టీ పటిష్టతకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, అయితే ఇవి ప్రజల వద్దకు చేరుకోకపోవడం బాధాకరమన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీ నేతలు సమన్వయంతో పనిచేస్తేనే గౌరవం ఉంటుందన్నారు. ప్రధానంగా వర్గాలను పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి పాటుపడాలన్నారు. జన్మభూమి కమిటీలను సమన్వయం చేసుకుని అందరికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు విధిగా పాలుపంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు వెంకటసుబ్బారెడ్డి, హనుమంతరావు, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎంపి శివప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బకు
వ్యవసాయ కూలీ మృతి
పుత్తూరు, మార్చి 25: మండల పరిధిలోని పరమేశ్వర మంగళం పంచాయతీ ఆది ఆంధ్రవాడకు చెందిన వ్యవసాయ కూలీ కె.వెంకటేశ్వర్లు (34) శుక్రవారం వడదెబ్బకు గురై కన్నుమూశారు. కూలీ పనుల నిమిత్తం గురువారం పొలం పనులకు వెళ్లిన వెంకటేశ్వర్లు సృహతప్పి పడిపోవడంతో వెంటనే అతన్ని పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం రాత్రి రుయాలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈమేరకు వివరాలు నమోదుచేసినట్లు తహశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు.
తిరుమల ఘాట్‌రోడ్డులో పిట్టగోడను ఢీకొన్న జీపు
తిరుమల, మార్చి 25: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఓ జీపు రోడ్డుప్రమాదానికి గురై అందులోని భక్తులు తీవ్ర గాయాలకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతికి చెందిన జీపు తిరుమల నుంచి యాత్రికులతో తిరుపతికి బయలుదేరింది. జీపు మొదటి ఘాట్‌రోడ్డులోని 31వ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులకు కాళ్లు, చేతులు విరిగాయి. మిగిలినవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.