చిత్తూరు

కాపు కార్పొరేషన్ పేరుతో వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకిపురం, జూలై 19: కాపు కార్పొరేషన్ పేరుతో రుణాలు మంజూరు చేయిస్తామని ఓ యువకుడు జనాన్ని నమ్మించి మోసం చేస్తున్న సంఘటనపై మంగళవారం పలువురు పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. వాల్మీకిపురంలోని ఎంపిడివో, కాపు కార్పొరేషన్ అధికారులు తనకు బాగా తెలుసునని, తనకు 10 వేల రూపాయలు ఇస్తే బ్యాంకు రుణం మంజూరుచేయిస్తామని మోసం చేస్తున్న విషయాలు కూడా వెలుగుచూశాయి. మంగళవారం చింతపర్తికి చెందిన ఎస్ ఆర్ శ్రీనివాసులు, సుధాకర్ తదితరులకు 9505257523 నెంబరునుంచి ఫోన్ చేసి తాను కార్పొరేషన్ అధికారినని, మీకు కాపుకార్పొరేషన్ రుణాలు మంజూరయ్యాయని రూ.5 వేలు ఇస్తే పని జరిగిన తరువాత మరో 5 వేలు ఇవ్వాల్సి ఉంటుందని వారిని నమ్మించాడు. ప్రస్తుతం తాను వాల్మికిపురంలో వేచి ఉన్నానని, డబ్బులు తీసుకొని రావాల్సిందిగా వారిని ఆదేశించారు. దీంతో ఆ వ్యక్తిపై అనుమానం కలగడంతో రుణాలకు ధరఖాస్తు చేసుకున్న వ్యక్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశారు. సదరు ఫోన్ చేసిన వ్యక్తి గతంలో కూడా రుణాల పేరుతోవేలాది రూపాయలు వసూలుచేసి స్వాహా చేశాడని దర్యాప్తులో తేలింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మోసగాడు కొందరు అధికార పార్టీ నాయకుల ద్వారా చింతపర్తికి వెళ్లి మంగళవారం రాత్రి బాధితులతో మాట్లాడి ఫిర్యాదు వెనక్కు తీసుకోవాల్సిందిగా వారిపై ఒత్తిడి తెచ్చారు. ఇటువంటి మోసగానిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.