చిత్తూరు

వసతిగృహాలు, చౌల్ట్రీల్లో 3రోజులు మించి ఉన్నవారిపై సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 19: తిరుమలలోని వసతి గృహాలు, చౌల్ట్రీలలో మూడు రోజులు, అంత కంటే ఎక్కువ రోజులు ఉన్న వారి వివరాలతో టిటిడి ఐటి, విజిలెన్స్, ప్రజా సంబంధాల విభాగాలు సమన్వయంతో సర్వే నిర్వహించాలని టిటిడి ఇ ఓ డాక్టర్ డి సాంబశివరావుఆదేశించారు. మంగళవారం తిరుమలలో జె ఇ ఓ శ్రీనివాసరాజుతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని 7050 వసతిగృహాలు, చౌల్ట్రీలలో తాగునీరు, స్నానానికి వేడినీరు అందుబాటులో ఉండడంతో పాటు కొళాయిలు, వాష్‌బేసిన్‌లు విద్యుద్దీపాలు తదితరాల మరమ్మతులను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇ ఓ ఆదేశించారు. మహిళా శ్రీవారి సేవకులు ఉండే పిఎసి-3 భవనంలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసి, మరింత భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మరో 3రోజుల్లో ఫిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్-4ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో సేవలు అందించే శ్రీవారి సేవకుల తరహాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పూర్తి వివరాలను సేకరించాలని పిఆర్వోను ఆదేశించారు. శ్రీవారి ఆలయం, విడిది, కల్యాణ కట్ట, అన్నప్రసాదాలతో పాటు ఇతర విభాగాల అధికారులు, ఆయా విభాగాలకు సంబంధించిన చేయవలసినవి, చేయకూడని అంశాల జాబితాను రూపొందించి పి ఆర్వోకు ఇవ్వాలన్నారు. తద్వారా శ్రీవారి సేవకులకు ఈ అంశాలపై శిక్షణ ఇచ్చి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. భక్తులు ఆధార్‌కార్డుతో అంగప్రదక్షిణ టోకన్లు జారీ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఐ టి విభాగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, టిటిడి ఛీప్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఎఓ బాలాజి, ఎస్ ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ముఖ్య భద్రతాధికారి రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఇ ఓ కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.