చిత్తూరు

వేదవ్యాసుని జన్మదినమే గురుపౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదవ్యాసుని జన్మదినమే గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నామని తిరుపతి సంస్కృత విద్యాపీటం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ తెలిపారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు, కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో డాక్టర్ చక్రవర్తి రంగనాథన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత చక్రవర్తి రంగనాథన్ మాట్లాడుతూ ఆషాడ శుద్ధ పూర్ణిమను వేదవ్యాసుని జన్మదినంగా, అదేరోజును గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా గురువులను పూజించడం ఆనవాయితీగా అనుసరిస్తున్నామన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలాలుగల విద్య వేదవిద్య అన్నారు. వేదాలు హితాన్ని బోధిస్తాయన్నారు. వేద వాంగ్మయాన్ని 4 భాగాలుగా విభజించ వేదవ్యాసుడయ్యాడన్నారు. వేదవ్యాసునికి బాదరాయనుడు, కృష్ణద్వైపాయనుడు అన్న పేర్లుకూడా ఉన్నాయని ఆయన తెలియజేశారు. సత్యనారాయణ రాజు మాట్లాడుతూ అష్టాదశ పురాణాలను పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన మహా భారతాన్ని మానవ సందేహాలను నివృత్తిచేసే భగవద్గీత గ్రంథాన్ని మనకందించిన వేదవ్యాసుడు విష్ణు స్వరూపడన్నారు. యువత మంచి వ్యక్తిత్వ వికాసాన్ని పొందడానికి భగవద్గీత ఒక దిక్సూచి అన్నారు. అనంతరం విద్యార్థులు ఆలపించి ప్రసంగించిన సద్గురు సాంగత్య గురుపాట, స్తోత్రాలు, దక్షిణామూర్తి విశిష్టప్రసంగాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎస్. ఇందిర, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ కె. హైమావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.