చిత్తూరు

‘ప్రేమతత్వమే సాయితత్వం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: ప్రేమతత్వమే సాయితత్వమని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి జిల్లా ఆరోగ్యవిభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఆర్.సుధారాణి, ఐ ఎం ఎ నాయకులు సుకుమార్, భారతీయ విద్యాభవన్ ఫౌరసంచాలకులు, కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణ రాజు అన్నారు. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాల్లో సాయినిలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయిబాబా ఆలయాల్లో స్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సాయి ప్రార్థనలో పులకించి తరించారు. అలాగే ఇతర హైందవ ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి.
మారుతీ నగర్‌లో..
మారుతీ నగర్‌లోని షిరిడీసాయి మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ, డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ సాయిబాబు జగద్గురువుగా గురుపీఠంపై నిలిచి సర్వమానవాళికి శాంతి, సహనం, సౌభ్రాతృత్వం అనే మార్గాలను చూపారన్నారు. దత్తాత్రేయ స్వరూపడైన సాయిబాబా మన పెద్దలు జీవించిన కాలానికి ప్రత్యక్ష సాక్షులన్నారు. సాయిని ప్రత్యక్షంగా చూసి తరించిన సమకాలీకులు 1982 వరకు జీవించి ఉన్నారని పేర్కొన్నారు. డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ సాయినాథుడు జగతికి చూపిన మార్గం ప్రేమమార్గమన్నారు. అందరూ ఆచరించే మార్గమన్నారు. నేటి తరానికి సాయినాథుడు ఆరాధ్యనీయుడని కొనియాడారు. అనంతరం ఆలయ ధర్మకర్త ఉంగరాల హరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నరసింహయాదవ్, దంపూరి భాస్కర్, గుణశేఖర్, కృష్ణయాదవ్, స్థానికులు మణి,దేవా, జీవ, రాధాకృష్ణలు పాల్గొన్నారు.
పతంజలి విశిష్ట యోగా శిక్షకులకు సన్మానం
గురుపౌర్ణమినాడు గురువులను గౌరవించుకోవడం, సన్మానించుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో మంగళవారం
గురుపౌర్ణమిని పురస్కరించుకొని తుడా కార్యాలయంలోని రాజీవ్ సభామందిరంలో జిల్లాలోని నిత్య యోగ శిక్షణ ఇచ్చే పతంజలి విశిష్ట యోగా శిక్షకులైన 60 మందిని ఎంపికచేసి సన్మానించారు. సమితి జిల్లా అధ్యక్షులు కైలాస సింగ్ రాజపురోహిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత స్వాభిమాన్ గౌరవాధ్యక్షులు కె.వెంకటరెడ్డి, ఓటేరు కృష్ణ, సహ అధ్యక్షులు విజయ్‌కుమార్, మహిళా పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షులు పివి ఎస్ లక్ష్మి, యువభారత్ అధ్యక్షులు మురళినాయుడు, కార్యదర్శి వరుణ్, ఉపాధ్యక్షులు నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ ఆర్.సుధారాణి, విశిష్ట వ్యాఖ్యాత, టిటిడి ఓరియంటల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ బాబా రాం దేవ్ వారి ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు యోగా గురువు కావాలని అభిలషించారు. గురుపౌర్ణమి పూజలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రాంత అధ్యక్షులు మాట్లాడుతూ పతంజలి యోగ సూత్రాన్ని ఆచరిస్తూ బాబా రామ్‌దేవ్ మరో పతంజలిగా అవతారమెత్తారన్నారు. యోగాతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చని, అందుకే ప్రతి మనిషి యోగాభ్యాసం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తంగరాజు, ప్రభాకర్ శెట్టి, రామకృష్ణమరాజు, గోపి, విశాల్, రవీంద్ర, జయచంద్రారెడ్డి, వేణుగోపాల్, ఉమాదేవి, వాణి, ధనలక్ష్మి, విశిష్ట కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.