చిత్తూరు

నిబంధనల ప్రకారమే ఒప్పంద అధ్యాపకుల పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 21: టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే ఒప్పంద అధ్యాపక పోస్టుల నియామకాలు చేపడతామని టిటిడి జె ఇ ఓ పోలాభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలో 3 డిగ్రీ కళాశాలలు, 2 జూనియర్ కళాశాలలు, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయన్నారు. వీటిలో ఒప్పంద అధ్యాపకుల పోస్టులను భర్తీచేసేందుకు ఇటీవల ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ టిటిడికి ఇచ్చిన సూచనల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలుచేస్తూ నియామకాలు చేపడుతున్నామన్నారు. అర్హుల జాబితాను, ఎంపికైన వారి వివరాలను టిటిడి డి ఇ ఓ కార్యాలయంలో ప్రకటిస్తామన్నారు. డబ్ల్యూ. డబ్ల్యూ.డబ్ల్యూ.తిరుమల.ఓఆర్‌జి వెబ్‌సెట్‌లో పొందుపరచినట్లు తెలిపారు. 2016-17 విద్యాసంవత్సరానికి గాను ఒప్పంద ప్రాతిపదికన నియమించే ఈపోస్టులకు సంబంధించి సర్ట్ఫికెట్లు పరిశీలించిన అనంతరం నియామాక ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. ఇక కళాశాలవారీగా ఈక్రిందివిధంగా పోస్టులు భర్తీచేయడం జరుగుతుందన్నారు.
డిగ్రీకళాశాలలు
మొత్తం 31 పోస్టులు భర్తీ చేయనున్నామని, ఇందులో 14 మహిళలకు, 17 పురుషులకు కేటాయించామని జె ఇ ఓ భాస్కర్ తెలిపారు. వీటిలో ఎస్సీలకు 6, ఇందులో మహిళలకు 4, పురుషులకు 2 కేటాయించామన్నారు. ఎస్టీలకు 10 పోస్టులు.. ఇందులో 4 మహిళలకు, 6 పురుషులకు కేటాయించామన్నారు. బిసి-ఎ కు 2 పోస్టులు కేటాయించామని, ఒకటి మహిళలకు, ఒకటి పురుషులకు అని తెలిపారు. బిసి-బికు 1 మహిళలకు కేటాయించామన్నారు. బిసి-డికు 1 పోస్టుకు గాను మహిళలకు కేటాయించామన్నారు. ఓసిలకు 11 పోస్టులకు గాను 3 మహిళలకు, 8 పురుషులకు కేటాయించామని భాస్కర్ వివరించారు.
జూనియర్ కళాశాలలు
మొత్తం 25 పోస్టులు ఉన్నాయని, వీటిలో 11 పోస్టులు మహిళలకు, 14 పోస్టులు జనరల్‌కు కేటాయించామన్నారు. దీంట్లో ఎస్సీలకు 4 పోస్టులకు గాను 2 మహిళలకు, 2 జనరల్‌కు కేటాయించామన్నారు. ఎస్టీలకు 4 పోస్టులకు గాను 2 మహిళలకు, 2 జనరల్‌కు కేటాయించామన్నారు. బిసి-ఎ లకు 2 పోస్టులకు గాను 1 మహిళలకు, 1 జనరల్‌కు కేటాయించామన్నారు. బిసి-బి కు 2 పోస్టులకు గాను 1 మహిళలకు, 1 జనరల్‌కు కేటాయించామన్నారు. బిసి-డి కు 1 పోస్టును మహిళలకు కేటాయించామన్నారు. ఓసిలకు 12 పోస్టులకు గాను 4 పోస్టులు మహిళలకు, 8 జనరల్‌కు కేటాయించామన్నారు.
పాలిటెక్నిక్ కళాశాల
మొత్తం 4 పోస్టులకు గాను 1 పోస్టు మహిళకు, 3 పోస్టులు జనరల్‌కు కేటాయించామన్నారు. ఎస్సీలకు ఉన్న 1 పోస్టును జనరల్‌కు కేటాయించామన్నారు. ఎస్టీలకు ఉన్న 1 పోస్టును మహిళలకు కేటాయించామన్నారు. ఒసీలకు ఉన్న 2 పోస్టులను జనరల్‌కు కేటాయించామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఇ ఓ మునిరత్నం రెడ్డి, విద్యాశాఖాధికారి విజయ్‌కుమార్, డిప్యూటి ఇ ఓ విజయసారధి, స్నేహలత, వరలక్ష్మి, మునిలక్ష్మి, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.