చిత్తూరు

మాయదారి టిబి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జూలై 21: ఇరవై రోజుల్లో తల్లి, కుమారుడు టిబివ్యాధితో మృతి చెందిన సంఘటన గుడుపల్లి మండల పరిధిలోని బిజిగానిపల్లి గ్రామంలో జరిగింది. తిమ్మప్ప భార్య తిమ్మక్క (42) గురువారం ఉదయం టిబి వ్యాధితో ఇంటి వద్దనే మృతి చెందింది. ఆమె కుమారుడు మునికృష్ణ(18) ఈనెల 1వ తేదిన టిబి వ్యాధితో మృతి చెందాడు. కేవలం ఇరవై రోజుల్లోనే తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరోవైపు తిమ్మక్కకు పిన్నమ్మ వరుస అయిన తిమ్మక్క ఆమె కుమారుడు హంసగిరి 16నెలల క్రితం టిబి వ్యాధితో ఇదే గ్రామంలో మృతి చెందారు. ఈ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీనికి తోడు గురువారం చనిపోయిన తిమ్మక్క భర్త తిమ్మప్ప సైతం టిబి వ్యాధితో బాధపడుతూ నేడో రేపో చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని గ్రామస్థులు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ గ్రామంలో మిగతా వారికి కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేవలం 16నెలలోనే ఒకే కుటుంబంలో టిబి వ్యాధితో నలుగురు చనిపోవడంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై గుడుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సంప్రదించగా తాము వీరికి ఎప్పటికప్పుడు చికిత్సలు అందిస్తున్నామని, అయితే ఇది వంశపారం పర్యంగా వస్తున్న కారణంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి ఉండే అవకాశం ఉందన్నారు. ఆకుటుంబంలో మిగిలిన వారికి రేపు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.