చిత్తూరు

పారిశుద్ధ్య కార్మికులకు ధర్మబద్ధంగా జీతాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 22: రాత్రనక, పగలనక ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మలమూత్రాలను శుభ్రంచేసి పారిశుద్ధ్యాన్ని అందిస్తున్న కార్మికులు కడుపుకాలి పనిచేయడం ఆపితే ఆ పని మరొకరు చేయలేరని ధర్మబద్ధంగా జీతాలిచ్చి వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌కు విజ్ఞప్తిచేశారు. రుయాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన వందలాది కార్మికులతో కలిసి రుయా సూపరింటెండెంట్‌ను ఆయన ఛాంబర్‌లో కలసి విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రుయాలో పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి ముంబయికు చెందిన ఓ సంస్థలో ఆన్‌లైన్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దుచేసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా రోజుకు ఒక కార్మికుడికి రూ.400పై చిలుకు వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంత్రి వర్గంలో కూడా రూ.7వేలు ఉన్న వేతనాలను రూ.12 వేలు చేయాలని నిర్ణయించిందని, త్వరలోనే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేయనున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంబైలో ఉన్న గుత్తేదారునికి రూ. 3 కోట్లు పనుల కోసం ఒప్పందం కుదుర్చుకుని ఇందులో రూ.1 కోటి 30 లక్షలు జీతాల కోసం కేటాయించడం ఎంత వరకు ధర్మమన్నారు. 200 మందికి యేడాదికి రూ.45 లక్షల రూపాయలు వేతనాలు ఇస్తే ఒక్కొక్కరికి నెలకు ఎంతవస్తుందో లెక్కలు వేయాల్సిన బాధ్యత మీది కాదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఎప్పుడు ధరలు మరింత పెరుగుతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి వాతావరణంలో 3 సంవత్సరాలకు గుత్తేదారులతో ఒప్పందాలు కుదర్చుకుంటే కార్మికుల బతుకేమి కావాలని ఆయన ప్రశ్నించారు. ఓవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటున్నాయని, కిలోబియ్యం రూ.50 ధర పలుకుతుందని, ఒక పప్పు దినుసులు కేజి రూ.200 పలుకుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లులేక అద్దింట్లో ఉంటూ పెరిగిన ధరలతో రూ.7వేల రూపాయలతో ఒక కార్మికుడు ఎలా కుటుంబాన్ని పోషిస్తాడని ఆయన ప్రశ్నించారు. అందులోనూ కార్మికులు కార్యాలయాల్లో కూర్చొని విధులు నిర్వహించడం లేదని ,మలమూత్రాలు శుభ్రంచేస్తూ అనేక వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. అలాంటి నిరుపేదలు వ్యాధుల బారిన పడితే రుయా ఆసుపత్రిలో తగినవైద్యం కూడా లేదన్నారు. చివరకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం వారు తమ శరీరంలోని భాగాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదాఅని ఆయన ప్రశ్నించారు. నిరుపేదల కడుపులు కొడితే మంచిదికాదన్నారు. మనందరం నిరుపేదల కుటుంబం నంచి వచ్చినవారమన్నారు. రుయాలో డాక్టర్లు బాగా పనిచేస్తున్నా తగిన సౌకర్యాలు లేకపోవడంతో పేదలు బలైపోతున్నారన్నారు. రుయా ఆసుపత్రిలో గుండె, మెదడు, నరాలు, మూత్రపిండాలు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు రుయాలో విభాగాలు, వైద్యులు లేరన్నారు. ఇదే గుంటూరు, వైజాక్, కర్నూలు లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని విభాగాలు, డాక్టర్లు ఉన్నారన్నారు. ఈ క్రమంలో తిరుపతిలో ఉన్న పేదవారు చేసిన పాపమేమిటని ఆయన ప్రశ్నించారు. నిధులుకేటాయించాలని, విభాగాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని నాయకులకు సూచించారు. ప్రభుత్వానికి చేతకాకపోతే తాను రుయాకు నిధులు తీసుకొచ్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడుతానన్నారు. తక్షణం గుత్తేదారులు పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకోని పారిశుధ్యకార్మికులకు న్యాయం జరిగేలా జీతాలివ్వకపోతే వారు పనిచేయరన్నారు. దీంతో రుయాలో దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అది ఇక్కడ పుట్టి పెరిగి చదువుకున్న వ్యక్తిగా రుయాలో ఇబ్బందికర పరిస్థితులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను హెచ్చరించడానికి వచ్చానన్నారు. రుయాలో ప్రతి పేదవానికి కార్పొరేట్ తరహాలో ఉచిత వైద్యం అందాలని, అలా జరగడంలేదని, పేదవాడికి ద్రోహం చేస్తున్నామని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. రూ.120 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రికి కేంద్రమంత్రి జయరాం రమేష్‌తో పునాదిరాయి వేయిస్తే చివరికి ఆ పునాది రాయిని కూడా లేకుండా చేసిన ఘనత రుయా ఆవరణంలో జరిగిందన్నారు. రుయాలో అంతాగొప్పగా ఉందని మాటలుచెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కార్మికులకు కన్నీళ్లక్షేత్రంగా మార్చవద్దని, అదేజరిగితే వారి కన్నీళ్ల సునామీలో ప్రభుత్వాలు కాలగర్భంలో కలుస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, శాంతి, శోభ, తేజోవతి, చాముండి, చంద్రకళ, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
రుయాను ఆధారంగా జీవిస్తున్న అంబులెన్స్ డ్రైవర్లకు న్యాయం చేయాలి రుయా ఆసుపత్రిలో వచ్చే రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించడానికి అంబులెన్స్ పెట్టి జీవిస్తున్న వారికి తగిన న్యాయం చేయాలని తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్, రుయా సూపరింటెండెంట్ సిద్దార్థనాయక్‌కు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి ఆవరణంలో అంబులెన్స్ పెట్టుకునే అవకాశం కల్పించాలని, ఎక్కువ సంఖ్యలో కాకపోయినా పరిమితి సంఖ్యలో అనుమతిస్తేవారు రొటేషన్ పద్దతిలో అంబులెన్స్ నడుపుకుంటారని సూచించారు. ఈసందర్భంగా ఆర్ ఎం ఓ ఆర్ ఆర్ రెడ్డి మాట్లాడుతూ ఒక అంబులెన్స్‌ను అనుమతిస్తున్నామని సమాధానం ఇచ్చారు. అలాకాకుండా ఎక్కువ మందికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.