చిత్తూరు

తలనీలాల విక్రయం ద్వారా 12.21 కోట్లు ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 1: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోట్ల భక్తులు సమర్పించిన తలనీలాలకు టిటిడి తిరుమల ఇన్‌చార్జ్ జె ఇ ఓ పోలాభాస్కర్ ఆధ్వర్యంలో గురువారం ఈ-వేలం నిర్వహించారు. వీటిలో 11.300 వేల కిలోలకు రూ.12.21 కోట్ల ఆదాయాన్ని టిటిడి గడించింది. కాగా గురువారం భక్తులు స్వామివారిని దర్శించుకొని హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.2.83 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇదిలా ఉండగా ప్రతినెలా మొదటి గురువారం తలనీలాల ఈ వేలం జరుగుతుంది. కిలో రూ.25,563వేలుగా ఉన్న 4,400 కిలోలమొదటిరకం తలనీలాలను వేలంలో ఉంచగా, వీటిలో 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.76.69 లక్షల ఆదాయం వచ్చింది. కిలో రూ.19,042వేలుగా ఉన్న 32,900 వేల కిలోల రెండోరకం తలనీలాలను వేలంలో ఉంచగా, వీటిలో 6,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1,142.52 లక్షల ఆదాయం వచ్చింది. కిలో రూ.4,313 గా ఉన్న 86,100 కిలోల మూడోరకం తలనీలాలను అమ్మకానికి ఉంచగా ఇవి ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ.3,583వేలుగా ఉన్న 15,100 కిలోల నాలుగోరకం తలనీలాలను అమ్మకానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ.31గా ఉన్న 67,000వేల కిలోల ఐదోరకం తలనీలాలను వేలంలో ఉంచగా, వీటిలో 5,000 వేల కిలోలు అమ్ముడుపోయాయి. త ద్వారా రూ.1.55 లక్షల ఆదాయం వచ్చింది. కిలో రూ.6,707వేలగా ఉన్న 2,300వేల కిలోల తెల్ల వెంట్రుకలు ఈ-వేలంలో అమ్ముడుపోలేదు.