చిత్తూరు

ఎస్వీబీసీ ద్వారా తిరుమల నంబి బోధనలకు విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 8: శ్రీవారి భక్తాగ్రేసరుడైన శ్రీ తిరుమలనంబి, భగవద్ రామానుజుల బోధనలను శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయం దక్షిణమాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి సన్నిధిలో శ్రీ తిరుమల నంబి 1043వ అవతార మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వీరరాఘవ తాతాచార్య రచించిన ‘‘హిస్టరీ ఆఫ్ తిరుమల టెంపుల్’’ ఆంగ్ల పుస్తకాన్ని ఇ ఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి జీవితంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఇ ఓ మాట్లాడుతూ భగవద్‌రామానుజుల మేనమామ అయిన శ్రీ తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని శ్రీవారికి అంకితం చేశారని తెలిపారు. అవతార మహోత్సవాల్లో 80 మంది తిరుమల నంబి వారసులు పాల్గొనడం ముదావహమన్నారు. సదస్సులో 16 మంది పండితులు పాల్గొని ప్రసంగించినట్లు తెలిపారు. శ్రీ తిరుమల నంబి సన్నిధి వద్ద మండపం నిర్మాణాన్ని పరిశీలిస్తామన్నారు. పండితుల సలహాలు, సూచనలు స్వీకరించి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టును మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో భాగంగా త్వరలో తిరుపతిలో జాతీయ సదస్సు నిర్వహిస్తామన్నారు. టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ శ్రీవారి భక్తులందరికీ తిరుమల నంబి ఆదర్శనీయులన్నారు. తిరుమలనంబి సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో విస్తృతంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు చెన్నైకి చెందిన విశ్రాంత ఐఎఎస్ పి. ఆర్ రామానుజన్ కీలకోపన్యాసం చేశారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ వి.జి. చొక్కలింగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.