రాష్ట్రీయం

సిఎంను కలిసే అవకాశం లేక కటౌట్ ఎక్కి కర్నూలువాసి హల్‌చల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: వ్యవసాయంలో అప్పుల పాలైన తన కష్టనష్టాలను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుపుకునేందుకు రాగా అధికారులు అవకాశం కల్పించక పోవటంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతు గోవిందరాజులు సోమవారం ఇక్కడ హల్‌చల్ చేశాడు. సిఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోని ముఖ్యమంత్రి నిలువెత్తు కటౌట్ పైకి ఎక్కి కొంతసేపు ప్రజలను, పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ కూడా రాసి కిందపడేయటంతో పోలీసులు మరింత ఆందోళనకు గురయ్యారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నానని, తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానినని, తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా వుందని, వ్యవసాయంలో రూ.3.20 లక్షలు నష్టం వచ్చి అప్పుల పాలయ్యానంటూ లేఖలో పేర్కొన్నాడు. డిసెంబర్ 3 తరువాత ముఖ్యమంత్రిని కలిసేలా చూస్తామని అతనికి నచ్చచెప్పి సురక్షితంగా కిందికి దించారు.

నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి
విశాఖపట్నం, నవంబర్ 30: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ఇది బలపడే అవకాశంపై కచ్చితమైన అంచనాల్లేవన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురు, మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి ఈశాన్య దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ నెల్లూరు జిల్లా కావలి, రావూరులో 9 సెంమీ, ఆత్మకూరు, గూడూరు, తడ, వింజమూరు, వెంకటగిరి ప్రాంతాల్లో 6 సెంమీ, తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 4 సెంమీ వర్షపాతం నమోదైంది.

ఎయు విసికి వియత్నాం వర్శిటీ అవార్డు
విశాఖపట్నం, నవంబర్ 30: ప్రపంచ శ్రేణి వర్శిటీల్లో గుర్తింపు ఉన్న వియత్నాం నేషనల్ యూనివర్శిటీ ఈ ఏడాది ‘ఇజ్మెర్ జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డును ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజుకు అందజేసింది. సోమవారం వర్శిటీ సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విసి జిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ఈ అవార్డు ఆదివారం తనకు అందిందన్నారు. తాను చేసిన కృషికి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు. కాగా, ప్రతీ ఏటా ఈ అవార్డు ఆ దేశంలో వారికే లభించేదని, తొలిసారిగా భారత్‌కు లభించిందని వివరించారు. విశ్వవిద్యాలయం ప్రగతి, విద్య, పరిశోధన తదితర రంగాల్లో చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించిందన్నారు. వియత్నాం వర్శిటీ రెక్టార్ డాక్టర్ లీ కిమ్ లాంగ్ ఈ అవార్డును పంపించారన్నారు.

మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్
భద్రాచలం, నవంబర్ 30: లొంగిపోయిన మావోయిస్టులను హతమార్చే వ్యూహంలో భాగంగా రెక్కీ నిర్వహించడానికి వచ్చిన మావోయిస్టు దళ కమాండర్‌ను చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం దంతెవాడలో డీఆర్‌జీ బలగాలు సోమవారం వలపన్ని పట్టుకున్నాయి. దంతెవాడ ఏరియా కమాండర్ రఘు జిల్లా కేంద్రంలో సంచరిస్తున్నట్లు పోలీసు నిఘా వర్గాలు పక్కా సమాచారం ఇవ్వడంతో జిల్లా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. బస్తర్ ఐజీ కల్లూరి, దంతెవాడ ఎస్పీ కమల్‌లోచన్ కశ్యప్ పర్యవేక్షణలో రఘును వ్యూహాత్మకంగా పోలీసులు అరెస్ట్ చేశారు. లొంగిన మావోయిస్టుల కోసం వచ్చి వారిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లు రఘు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇతనిపై రూ.8లక్షల రివార్డు ప్రకటించి వుంది.