క్రైమ్/లీగల్

ప్రత్యేక పీపీ నియామకంపై 12న హైకోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: విశాఖ జిల్లా ఏజన్సీ వాకపల్లి ఘటనకు సంబంధించి విచారణ కోర్టులో ప్రత్యేక పీపీగా పి.త్రినాథరావు నియామకాన్ని సవాలుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం వచ్చే సోమవారం విచారించనున్నట్లు ప్రకటించింది. గతనెల 5వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ కోర్టులో ప్రత్యేక పీపీగా పి త్రినాథరావును నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం, విశాఖ కలెక్టర్ తరఫున ఏపీ ప్రభుత్వ న్యాయవాది టి. ప్రద్యుమ్నకుమార్ రెడ్డి పిటిషన్లను ధర్మాసనం వద్ద దాఖలు చేశారు.