ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్- 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. దాదాసాహెబ్ ఫాల్కే మూకీ చిత్రం ‘రాజ హరిశ్చంద్ర’ బొంబాయిలోని ఒలింపియా థియేటర్‌లో విడుదలైంది. అయితే అది ఏ సంవత్సరం?
3. భారతీయ సినిమాకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా దేశంలో ప్లాటినమ్ జూబ్లీ జరిగిన సంవత్సరం ఏది?
4. 1933లో వచ్చిన ‘కర్మ’ అనే చిత్రంలో
నటించిన జంట?
5. మొదటి టాకీ చిత్రం/ఇంగ్లీషులో రూపొందించబడిన మొదటి చిత్రం..ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఆ చిత్రం పేరేమిటో?
6. దక్షిణ భారత దేశంలో ‘కాళిదాసు’ పేరుతో తమిళ చిత్రాన్ని, భక్తప్రహ్లాద పేరుతో తెలుగు చిత్రాన్ని రూపొందించిందెవరు?
7. మనదేశంలో మొట్టమొదటి సారి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగిన సంవత్సరం?
8. భారతీయ సమాంతర సినిమాకు
పునాదులు వేసిన వ్యక్తి?
9. సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’
వెలువెడిన సంవత్సరం?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*

సమాధానాలు- 63

1. కాటమరాయుడు
2.11 ఆగస్టు 1966
3. విజయనిర్మల
4. ఎం. మల్లికార్జునరావు
5. సత్యం, 6. జయప్రద
7. కోడి రామకృష్ణ, 8. అమాయకుడు
9. నిలువుదోపిడీ, 10. అవికాగోర్

సరైన సమాధానాలు రాసిన వారు

1. వి.శరణ్య, కాకినడా
2. మహేష్‌బాబు, కదిరి, అనంతపురం
3. కె. అలేఖ్య, వస్థలిపురం
4. బి. భాగ్యలక్ష్మి, సూర్యాపేట
5. కె. విశే్వశరరావు, విశాఖపట్నం
6. మాలిని, వనస్థలిపురం, హైదరాబాద్
7. సి.హెచ్ నారాయణరావు, కదిరి
8. డి.రాజారావు, విశాఖపట్నం
9. ఆర్.వి. విశే్వశ్వరరావు, మహబూబ్‌నగర్
10. ఎం. మదన్‌మోహన్, గుంటూరు
11. పి.యుమునశ్రీ, అమలాపురం
12. పి. కల్పనశ్రీ, హన్మకొండ
13. పి. కిరణ్‌కుమార్, హైదరాబాద్
14. కె.రాజారావు, గజ్వేల్
15. బి.విశే్వశ్వరావు, గుంటూరు
16. ఆర్.కె.రాజు, భువనగరి
17. డి.శేఖర్‌రాబు, మచిలీపట్నం
18. కె.వినయ్‌కుమార్, హైదరాబాద్
19. బి.రాజు, శేఖర్, కాకినాడ
20. సి.హెచ్. రాజు, వనస్థలిపురం
21. కె. భూమేశ్వర్, సికిందరాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్