Others

రెండక్షరాల ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ రెండక్షరాలైనా
రెండుగుండెలను ఒకటి చేసి
ఇరుహృదయాల్లో
ప్రేమగా రూపం దాలుస్తుంది
పురుడు పోసుకున్న ప్రేమకు
ఆకలి దప్పుకలుండవు!

కులం, మతం,
జాతి వర్ణ భేదాలుండవు!
ప్రేమ పరిచయమయ్యాక
ప్రేమ పదనిసల సరిగమలలో
ఊహాలోకంలో
విహరింపచేస్తుంది
ప్రేమికులను!

ప్రేమలో పడిన హృదయానికి
లోకమే తనది,
లోకమే నేనకుంటుంది
ప్రేమలో మునిగిన హృదయానికి
ఆకాశమే హద్దనుకుంటుంది!
ఆకాశమే ఆవాసమనుకుంటుంది!

ప్రేమలో తేలడం సులువేం కాదు
ప్రేమ సాగరం ఈదలేం
ప్రేమ పదిలమైతే
పరమ పద సోపానంలో నిచ్చెనే

ప్రేమ విఫలమైతే
వైకుంఠపాళీలో సర్పమే

ప్రేమ ఒక కళ
ప్రేమించడం సులభం
ప్రేమించబడటం తరం కాదు
ప్రేమతో ప్రేమగా ప్రేమను

ప్రేమగా దక్కించుకోవడం కష్టం!
ప్రేమను దక్కించుకున్ననాడే,
ప్రేమను దక్కించుకొన్న వాడే
ప్రేమించబడుతాడు
ప్రేమను పొందగలుగుతాడు
శుభాకాంక్షలు

కుంచె చింతాలక్ష్మీ నారాయణ