రాష్ట్రీయం

ధోరణి మారకపోతే జైలుకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: అగ్రిగోల్డ్ కేసులో ఏపి సిఐడి పోలీసుల పనితీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. నిందితుల బ్యాంకు ఖాతాలనుంచి డబ్బు వేరే ఖాతాలకు మళ్లిపోయినా గుర్తించలేకపోయారంటూ పోలీసుల తీరును తప్పుపట్టింది. పోలీసుల ధోరణి మారకపోతే దర్యాప్తు అధికారిని జైలుకు పంపించాల్సి వస్తుందని హెచ్చరించింది. అగ్రిగోల్డ్ స్కాంపై తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏ రమేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ కేసును సిబిఐ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరారు. ఈ సందర్భంగా ఆంధ్ర సిఐడి అధికారులు తాము చేసిన దర్యాప్తు వివరాలను హైకోర్టుకు వివరించారు. ఇంతవరకు అగ్రిగోల్డ్ కంపెనీ బ్యాంకు ఖాతాలనుంచి ఆరు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అగ్రిగోల్డ్ కంపెనీ పది వేల కోట్ల రూపాయల డిపాజిట్లను వసూలు చేసింది. ఇంత సొమ్ము వసూలు చేస్తే ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయంటున్నారు. మిగిలిన సొమ్ము ఏమైంది?’ అని ప్రశ్నించింది. ‘దర్యాప్తు సంస్ధ ఈ కేసును తేలికగా తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. కేసు సంవత్సరం క్రితం నమోదైంది. కాని ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్ధ కోర్టును తప్పుదోవబట్టించిందని, ఈ కేసులో నిందితులను కస్టడీలో తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం లేదని తెలియజేశారంటూ హైకోర్టు పేర్కొంది. ఇదంతా చూస్తుంటే దర్యాప్తు సంస్ధ నిందితులతో కుమ్మక్కై నిధులు మళ్లించేందుకు అనుమతించారా అనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు నమోదైన వెంటనే అరెస్టులు జరిగి ఉంటే నిధుల మళ్లింపు సాధ్యమై ఉండేదికాదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు మరింత జాప్యమైన పక్షంలో, నిందితులకు బెయిల్ ఇవ్వరాదని బలంగా వాదనలు వినిపించిన పక్షంలో, దర్యాప్తు అధికారిని జైలుకు పంపాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఈ కేసును హైకోర్టు పర్యవేక్షిస్తోందనే సమాచారాన్ని కింది స్ధాయి కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తెలియచేయాలని హైకోర్టు ఏపి న్యాయవాది కృష్ణ ప్రకాశ్‌ను ఆదేశించింది.
ఆస్తుల వేలంపై నియమించిన త్రిసభ్య కమిటీ తరఫున న్యాయవాది రవి ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఆస్తుల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఈ ఆస్తుల విలువను సంస్థ ఎక్కువ చేసి చూపించిందని, అందుకే మళ్లీ ఆస్తుల విలువను మదింపు వేస్తామని చెప్పారు. త్రి సభ్య కమిటీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం వచ్చే శుక్రవారం లోగా రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలని హైకోర్టు అగ్రి గోల్డ్ నిందితులను ఆదేశించింది. దీనికి అగ్రిగోల్డ్ తరఫున వాదిస్తున్న న్యాయవాది అంగీకరించారు. ఒకవేళ ఈ సొమ్మును డిపాజిట్ చేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హైకోర్టు హెచ్చరించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు.