రాష్ట్రీయం

దంపతులకు యావజ్జీవ ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: డబ్బుకోసం కుమార్తె సహా భార్యాభర్తలను హత్య చేసిన దంపతులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విశాఖ నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. డబ్బు కోసం భర్తతో కలిసి సొంత కుమార్తె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాకవరం గ్రామానికి చెందిన కివిటి లక్ష్మీనారాయణ (55) భార్య మరణించడంతో మహాలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతోష్, ధన ఉన్నారు. లక్ష్మీనారాయణ మొదటి భార్య కుమార్తె రేఖ, ఆమె భర్త చిన్నారావు సహా కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. రేఖ సోదరి బోడమ్మ కూడా వీరితోనే ఉండేది. బోడెమ్మ ప్రమాద వశాత్తు మరణించగా, నష్టపరిహారంగా రూ. 2 లక్షలు వచ్చాయి. పరిహారంగా అందిన సొమ్ములో కొంత మొత్తం తమకు ఇవ్వాల్సిందిగా కుమార్తె రేఖ, అల్లుడు చిన్నారావు కోరారు. దీనికి లక్ష్మీనారాయణ నిరాకరించడంతో కుటుంబాన్ని అంతమొందించాలని పథకం పన్నారు.
లక్ష్మీనారాయణ, భార్య మహాలక్ష్మి, పిల్లలు సంతోష్, ధనతో కలిసి రేఖ, అల్లుడు చిన్నారావు 2010 జూన్ 5న విశాఖ వచ్చారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం వీరంతా లాడ్జిలో బసచేశారు. లక్ష్మీనారాయణ కుటుంబం గాఢ నిద్రలో ఉండగా, ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం లక్ష్మీనారాయణ, అతని భార్య మహాలక్ష్మిని రేఖ, చిన్నారావు హత్య చేసి, శవాలను మాయం చేశారు. తెల్లవారి లేచిన పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆరా తీయగా స్వగ్రామానికి వెళ్లినట్టు నమ్మించారు.
అనంతరం పిల్లలను సైతం హత్య చేసేందుకు పథకం రూపొందించుకున్నారు. ఈ ప్రయత్నంలో ధన మృతి చెందగా, సంతోష్ ప్రాణాలతో బయటపడ్డాడు. సంచలనం సృష్టించిన ఈ కేసును గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేసి, నేరం రుజువు చేశారు. దీంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది పాటు సాధారణ జైలు శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చారు.