డైలీ సీరియల్

విలువల లోగిలి-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది తమ సొంత కంపెనీగా భావిస్తారు. బాధ్యతగా పనిచేస్తారు. అప్పుడు కంపెనీ కూడా లాభాల బాటలోనే పయనిస్తుంది. ఆ లాభాలలో కాస్త పర్సంటేజ్ వాళ్ళకూ పంచితే ఇక ఆ కంపెనీని ఎవ్వరూ వీడరు కూడా. సూర్యచంద్ర కూడా అదే పనిలో ఉన్నాడు.
తండ్రితో చర్చించి ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఆయన తన దగ్గరకు రావటంతో బలమైన అండ తన ప్రక్కన చేరినట్లనిపిస్తోంది. కొండంత ధైర్యం కూడా!
ఇక విశ్వకయితే తనకు నాలుగు చేతులు ఉన్నట్లనిపిస్తోంది అత్తగారు పక్కనుంటే! సేవా కార్యక్రమాలలో ఆవిడ సలహాలను పాటిస్తూ పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా పాత్రధారిని చేస్తూ తనతో ఆవిడ, ఆవిడతో తనూ అన్నట్లు పాలు పంచుకుంటున్నారు. ఇపుడు ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురయ్యారు విశ్వ, సుగుణలకు అమృత తోడవటంతో. ఇక నరేంద్రనాథ్, సూర్యచంద్రలు వారి వెనక ఉండనే ఉంటారు అండ, దండలుగా!
అలా ఆ కుటుంబం అంతా మానవత్వపు బాటలో పయనించాలనే ప్రయత్నిస్తోంది. ఇంకా ఎంతో చెయ్యాలని తపన పడుతోంది. తమ సంపదనంతా తామే ఎలా అనుభవించాలా అని ఆలోచించే ఎంతోమందికి విరుద్ధంగా ఎంతమందికి ఎలా సహాయం చేయగలమా అని అనుక్షణం ప్రాకులాడుతున్నవారిని ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిందే!
****
వెనె్నల రాత్రిని బాల్కనీలో కుర్చీలు వేసుకుని కుటుంబం అంతా ఆస్వాదిస్తున్న సమయంలో ఉన్నట్లుండి గుర్తుకువచ్చినట్లు ‘‘ఆ! విశ్వా! నీకు చెబుదామనుకుంటూనే మరిచిపోతున్నాను మన ప్రక్క బిల్డింగ్‌ను అమ్మేస్తున్నారట’’.
‘‘అవునా’’ అంది పైకి
ఆమె మనసులో రకరకాల ఆలోచనలు ఉవ్వెత్తున కెరటాలులా పరుగెడుతున్నాయి. అదే సమయంలో చందూ ఈ మాట చెప్పటం యాదృచ్ఛికమే అయినా అది దైవ సంకల్పంగా ఆమెకు అనిపించింది.
అప్పటిదాకా తన మనసులో వున్న ఉద్దేశాన్ని చెప్పనా వద్దా అని ఆలోచిస్తున్నదల్లా ఇక బయటపెట్టడానికి భయపడాల్సిన అవసరం లేదు అనుకుంది.
‘‘మామయ్యా! మనం ఒక మంచి స్కూలు నడిపితే ఎలా ఉంటుంది?’’
‘‘బాగుంటుదమ్మా!’’
‘‘తెలుగు మీడియంలో’’
‘‘తెలుగు మీడియంలో అసలు ఇపుడు ఎవరు చదవాలనుకుంటున్నారు విశ్వా’’ అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు చందూ.
‘‘మనం వాళ్ళని ఇందులో చదవాలి అనుకొనేలా చేస్తే ఎవరైనా ముందుకొస్తారు’’
‘‘అది చాలా కష్టమేమో ఆలోచించు’’
‘‘మాతృభాషను కాపాడాలి అని వేదికలెక్కి మాట్లాడుతూ ఆ మాధ్యమానే్న దూరంగా నెట్టేయడం ఎంతవరకు సబబు? ఇపుడు గొప్పవాళ్ళుగా కీర్తించే ఎందరో ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోచదివినవారే కదా!’’
‘‘అది నిజమే కానీ ఇపుడంతా ఇంగ్లీషు మీడియం హవా నడుస్తోంది కదమ్మా!’’
‘‘అందరూ నడిచిన బాటలోనే నడవాలని ఏముంది మామయ్మా! మనమో కొత్త బాట వెయ్యకూడదా?’’
‘‘అసలు నీ ఉద్దేశ్యమేమిటో స్పష్టంగా చెప్పు’’ అంది అమృత మధ్యలో కలుగజేసుకుంటూ.
‘‘మనం ఎన్ని భాషలన్నా నేర్చుకోవచ్చు, కానీ మన మాతృభాషమీద మనకు పట్టు ఉండాలి. ఇది నా ముఖ్యోద్దేశం. పిల్లలను రుద్ది రుద్ది చదివించకూడదు. రాంక్‌లకోసం వాళ్ళను బాధపెట్టకూడదు. ఆడుతూ పాడుతూ, బాల్యాన్ని ఆస్వాదిస్తూ చదువుకోవాలి. ఇపుడు ఇలా కొన్ని స్యూల్స్ నడుస్తున్నాయి కూడా! కాకపోతే అవి ఇంగ్లీషు మీడియంలో.
ఇప్పటి పిల్లలకు ‘విలువలు’ అంటే ఏమిటో తెలియటం లేదు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే- యల్‌కెజి నుంచీ కూడా ప్రేమించవచ్చని. ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలియచెప్పాలి. రామాయణం, మహాభారతం లాంటి పురాణ కథలు, వాటిలో నీతులు ఎదిగేవారికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఒక పీరియెడ్ వీటికి కేటాయించాలి.
అలాగే పసిపిల్లల దగ్గరనుంచీ ముసలివాళ్ళదాకా ఎందరో ఆడపిల్లలు అమాయకంగా అత్యాచారాలకు బలి అవుతున్నారు. వాళ్ళకి ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించాలి. ఈ రోజే పేపర్లో చదివాను. 58 పాఠశాలలకు ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది అని. మంచి నిర్ణయం. ఇది ఎపుడో జరగాల్సింది. ఇప్పటికైనా అమలులోకి వచ్చినందుకు ఆనందించాలి. అదే మనమూ పాటించాలి. మధ్యాహ్నం రెండో పీరియడ్‌ని ఇలాంటివాటికి ఉపయోగించాలి. చివరి పీరియెడ్ ఆటలకు తప్పక కేటాయించాలి కాబట్టి. రకరకాల ఆటలు ఆడటంవల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయి.
మన భాష మనకు ఎంత ముఖ్యమో ఇంగ్లీషు, హిందీ కూడా మనకు అవసరమే. అందుకే హిందీని ఇంగ్లీషు లాంగ్వేజీలుగా ఇచ్చి, స్పోకెన్ ఇంగ్లీషుని కూడా నేర్పించాలి. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఒకపక్క పల్లెటొర్లో తెలుగు మీడియం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో వాళ్ళకన్నా బాగా ఇంగ్లీషు మాట్లాడారట. అది విన్నదగ్గరనుంచీ నా ఈ ఆలోచనకు స్థిరత్వం ఏర్పడింది.
ఇక శరీరానికి యోగా, వ్యాయామం అత్యవసరం. ఆరోగ్య సంరక్షణ కోసం వీటిని చేర్చాలి. ఈ వరుసలో భరతనాట్యం కూడా కలుస్తుంది.
చివరగా ముఖ్యమైనది వృత్తి విద్య. చదువుకున్న అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు. కానీ ఏదైనా వృత్తిలో రాణించగలిగితే ఉపాధికి అవకాశం వారికి వారే పొందగలుగుతారు. అలా పిల్లలకు వారికిష్టమైన ఏవృత్తిలో అయినా శిక్షణ తీసుకోవచ్చు. వాటిలో పెయింటింగ్, యామినేషన్... లాంటివి నేర్పాలి. ఇలా చేయగలిగితే విద్యార్థులు అన్నింటా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. ఇలా రోజుకొక నలభై ఐదు నిమిషాలు ఈ పద్ధతిలో కేటాయిస్తే రేపటి పౌరులుగా, మంచి వ్యక్తిత్వం వున్న మనుషులుగా తయారవుతారని నా నమ్మకం. అరాచకాలు, దుర్మార్గపు మనస్తత్వాలు ఈ రకంగా సమసిపోతాయని నా విశ్వాసం. ఇది నా అభిప్రాయం.
వింటున్న వారంతా శిలాప్రతిమల్లా మిగిలిపోయారో క్షణం.
‘‘విశ్వా! ఏమో అనుకున్నాను గానీ నీలో ఇన్ని అభిప్రాయాలు దాగున్నాయా? నేను నీకు ఓటేస్తున్నాను’’ అనేసారు ఆయన.
‘‘మనం డబ్బు సంపాదించాలని ఇలాంటి స్కూలు పెట్టాలని అనుకోవటం లేదు. ఒక మంచి స్కూలు అంటే ఇలా ఉండాలి.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ