డైలీ సీరియల్

ఒయాసిస్ 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణధీర్ వాళ్ల నెంబర్లు తీసుకున్నాడు. అందులో ఒక నెంబర్ దీప్తిది. ఆ నెంబర్ రణధీర్ దగ్గరుంది.
కనుక ఈ జంట సతీష్, దీప్తియే అన్న విషయం స్పష్టమయింది.
రాత్రి జరిగిన దోపిడీ కూడా వాళ్ళపనే అని అర్థమైంది..
మకాం ఎత్తేస్తున్నట్లు దీప్తి రణధీర్‌కి చెప్పింది. కానీ ఇప్పుడు ఎక్కడున్నదీ తెలియదు.
‘‘ఈ నెంబర్‌కు ఫోన్ చేసి వీడ్ని రప్పించగలవా? కానీ మనం ఫోన్ చేస్తున్నట్లు తెలిస్తే, వాడు రెస్పాన్స్ ఇవ్వడు..’’ అన్నాడు రణధీర్.
‘‘అవన్నీ నాకొదిలేయ్.. నేను చూసుకుంటా.. నిముషాల్లో రప్పిస్తాను వాడ్ని..’’ అన్నాడు శంభుప్రసాద్ నవ్వుతూ.
రణధీర్, శంభుప్రసాద్ పోలీసు స్టేషన్‌కొచ్చారు.
శంభుప్రసాద్ లేడీ కానిస్టేబుల్‌ని పిల్చాడు... ‘‘ఈ నెంబర్‌కి కాల్ చేసి ఇక్కడ యాక్సిడెంట్ అయింది.. ఒక అమ్మాయికి సీరియస్‌గా వుంది.. మీ నెంబర్‌కి కాల్ చేసి చెప్పమంది.. అని చెప్పు’’ అన్నాడు.
లేడీ కానిస్టేబుల్ సతీష్ నెంబర్‌కి ఫోన్ చేసింది..‘‘ నేనిక్కడ రాజీవ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ యాక్సిడెంట్ అయింది.. ఒక అమ్మాయికి సీరియస్‌గా వుంది. నీ నెంబర్‌కి ఫోన్ చేసి చెప్పమంది.. అర్జంటుగా రండి..’’
‘‘ఎక్కడ? ఎక్కడ?’’ అని ఆత్రంగా అడిగాడు సతీష్.
‘‘రాజీవ్ సెంటర్..’’ అని పెట్టేసింది.
పావు గంటలో సతీష్ అక్కడకు వచ్చి కానిస్టేబుల్ నెంబర్‌కి ఫోన్ చేశాడు.
‘‘నేను సతీష్‌నండి.. కొద్దిసేపటి క్రితం నాకు కాల్ చేశారు.. యాక్సిడెంట్ అయింది ఒక అమ్మాయికి సీరియస్‌గా వుంది..’’
లేడీ కానిస్టేబుల్ అతని దగ్గరకు వెళ్లి జీపు ఎక్కమంది. సతీష్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అపుడక్కడ శంభుప్రసాద్ ఒక్కడే వున్నాడు.
రాత్రి జరిగిన దోపిడీ కేసులో సతీష్‌ను అరెస్టు చేస్తున్నట్లు చెప్పాడు.
‘‘లేదండీ.. నేను రాత్రి సెకెండ్ షో సినిమాకెళ్ళాను.. కావాలంటే చూడండి.. నా టిక్కెట్టు.. సీటు నెంబర్‌తో సహా ఉంది..’’’
‘‘దానికేముందిలే.. టిక్కెట్టు కొన్నంత మాత్రాన నువ్వు సినిమా హాలులోనే ఉన్నావన్న రుజువేంటి? జనరల్‌గా సినిమా అయిపోయాక ఆ టికెట్ ముక్క ఎవడూ దాచుకోడు. నువ్వు దాన్ని భద్రంగా దాచావంటే ముందునుంచే ప్రీప్లాన్డ్‌గా ఉన్నావన్నమాట...’’ అన్నాడు శంభుప్రసాద్.
శంభుప్రసాద్ అరెస్ట్ చేస్తానని చెప్పగానే సతీష్‌కు భయమేసింది.
‘‘సర్.. రణధీర్‌గారని ఒక ఇన్స్‌పక్టెర్‌గారున్నారు.. ఆయనతో మాట్లాడవచ్చా?...’’ అని అడిగాడు సతీష్.
‘‘ఆయన నీకెట్లా తెలుసు..?’’
‘‘పరిచయం సర్..’’
‘‘ఆ కానిస్టేబుల్‌ని అడుగు మాట్లాడిస్తాడు..’’
కానిస్టేబుల్ సాయంతో, సతీష్ రణధీర్‌తో మాట్లాడాడు. ఒక గంట తర్వాత రణధీర్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు.
‘‘ఇతను రాత్రి ఒక ముసలమ్మను కత్తితో బెదిరించి, డబ్బు, నగలు ఎత్తుకెళ్లాడు..’’ అని శంభుప్రసాద్ రణధీర్‌కు చెప్పాడు.
‘‘అంతా వట్టిదే సార్. నేను సినిమాకెళ్ళాను సెకెండ్ షోకి..’’ అన్నాడు సతీష్ దాదాపు ఏడుపు మొహం పెట్టి.
రణధీర్ సతీష్‌ని బయటకు తీసుకెళ్ళాడు. కారులో ముందు సీట్లో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ట్రాఫిక్ రద్దీలేని చోట కారు ఆపాడు. అతను గమనించకుండా టేప్ ఆన్ చేశాడు. అతను చెప్పేది రికార్డు కావడం మొదలైంది.
‘‘సతీష్, రాత్రి జరిగిన విషయం అలా ఉంచు. అసలు మొదటినుంచీ, నీ కథా, నీ గాళ్ ఫ్రెండ్ కథా ఏమీ దాచకుండా చెప్పు.. నిన్ను సేవ్ చేయటానికి ప్రయత్నిస్తాను. కానీ మేటర్ ట్విస్ట్ చెయ్యవద్దు.. అబద్ధాలు చెప్పవద్దు..’’ అన్నాడు రణధీర్.
సతీష్ చెప్పటం మొదలుపెట్టాడు.. ‘‘సర్, ఒకసారి తిరుపతినుంచి వస్తుంటే దీప్తి రైల్లో పరిచయం అయింది. మర్నాడూ, ఆ మర్నాడూ అలా కొన్నాళ్లు కల్సుకుని, పార్క్‌ల్లో తిరుగుతూ, హోటళ్లల్లో తింటూ క్లోజ్‌గా మూవ్ అయ్యాక, ఇద్దరం కల్సి కమలానరగ్‌లో చిన్న పోర్షన్ తీసుకున్నాం సర్.. ఒక హాలు, లేదా పెద్ద రూం అనుకోండి.. చిన్న కిచెన్.. బాత్.. అంతే.. కల్సి ఉండటం మొదలెట్టాం.. నేనోదో చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ మానేస్తూ వస్తున్నాను. దీప్తి ఇంజనీరింగ్ కాలేజీలో క్లార్క్‌గా చేరింది. అహోబలరావుగారి భార్యదే నర్సింగ్ హోం ఉన్నందువల్ల ఒకటి రెండుసార్లు కొంచెం ప్రెగ్నెన్సీ అనుమానంతో డాక్టర్ శేతగారి దగ్గర చెకప్‌కి వెళ్లింది. వాళ్ల మేనేజ్‌మెంట్‌గల కాలేజీలో పనిచేస్తున్నానని చెబితే శే్వతగారు దీప్తి దగ్గర ఫీజు కూడా తీసుకోవడం మానేసింది.
‘‘ఒకసారి శే్వతగారు దీప్తిని పిలిపించి, సరోగేట్ మదర్ ప్రపోజల్ తీసుకొచ్చింది. అతి రహస్యంగా ఉంచుతానని ఏడాదిపాటు ఆమె బాగోగులు, ఖర్చులూ అన్నీ భరించి, అయిదు లక్షలు ఇస్తారని శే్వతగారే చెప్పారు. అసలు పార్టీని దీప్తి చూడలేదు కూడా. దీప్తి నాతో కన్సల్ట్ చేసింది. ఇద్దరం డబ్బు ఇబ్బందుల్లో ఉన్నందున, నేనూ ఒప్పుకోమని సలహా ఇచ్చాను. అప్పట్లో దీప్తికి మరెవరితో పరిచయాలు లేనందువల్ల, నేను ఎలా చెబితే అలా చేసేది.
‘‘తీరా ప్రాసెస్ మొదలయ్యాక, దీప్తి తనను ఉంచే అకామిడేషన్ ఎక్కడో చూపించమంది. శే్వతగారు ఒక అడ్రసు ఇచ్చి వెళ్లి ఆయన్ను కలవమన్నారు. ఆయన పేరు రాజశేఖర్. ఆయనకు రియల్‌ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారాలతో పాటు ఇంకా చాలా బిజినెస్‌లున్నాయి. చాలా గొప్ప శ్రీమంతుడు. జూబ్లీ హిల్స్‌లో ఆయన బిల్డింగ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయా అన్నట్లుంటుంది. ఆయన భార్య విదేశాల్లో ఉంటుందని చెప్పారు. ఆయనింట్లోనే ఒక ఫ్లోర్ దీప్తికి కేటాయిస్తానని చెప్పారాయన.

- ఇంకా ఉంది

శ్రీధర