డైలీ సీరియల్

విలువల లోగిలి-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమో! దేవి గారికి దేనిమీదా వ్యామోహం ఉండదుగా. అంత చేసినా గుర్తింపు ఉంటుందనుకోలేదు. ముద్దు ఇస్తావని కూడా ఊహించలేదు’’.
‘‘చందూ.. ఇంక ఆట పట్టించటం మానెయ్. ఇప్పటికి చేసింది చాలు’’.
‘‘ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. పద..పద’’ అంటూ ముందుకి కదిలాడు.
‘‘అక్కడ చూసావా? అది టెన్నీస్ కోర్టు.. అది ప్లేగ్రౌండ్.. అది లైబ్రరీ.. ఇక్కడ లేబొరేటరీ.. ఎదురుగుండా ఆఫీసు బిల్డింగ్.. దీని వెనుక హాస్టల్.. దానికి ఆనుకుని కాంటీన్.
అతను వరసగా చెప్పుకుంటూ వెళ్లిపోతున్నాడు.
విశ్వ వాటిని చూడటం మానేసి చందూనే చూస్తోంది.
‘‘విశ్వా! నా ముఖం ఎప్పుడూ చూసేదే! వీటిని చూడు’’.
‘‘ఉహూ! నాకు నినే్న చూడాలనిపిస్తోంది’’’
‘‘ఇంకాస్త ముందుకు వెళితే నన్ను మరిచిపోయి పరుగెడతావు’’ అంటూ కొంచెం దూరం తీసుకెళ్లి అటు చూడు అన్నాడు.
అక్కడ అంతా పూలమయం.
కనకాంబరాలు, మల్లెలు, చామంతులు, దమనం, లిల్లీలు, గులాబీలు, సంపెంగలు అన్నీ తోటలే.
అంతా ప్రక్క ప్రక్కనే చిత్రకారుడు రంగులు వేసినంత అందంగా.
విశ్వ లోకానే్న మరిచినంత ఆనందంగా వాటిమధ్యకు పరుగుతీసింది. వాటిని చూడటానికి తన రెండు కళ్ళు చాలవనిపించింది.
అలా ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలియదు.
అప్పుడు ఆమె దగ్గరికి వచ్చాడు చందూ.
‘‘విశ్వా! మీ ఇంట్లో ఒక్కో మొక్కను వదలి వచ్చావని నీకు అలాంటి పూతోటలే ఇవ్వాలనుకున్నాను. చిన్న ఆనందాన్ని నువ్వు వీడి నా కోసం వచ్చావని దానికి వంద రెట్లు ఆనందం తిరిగి ఇవ్వాలనుకున్నాను’’
‘‘ఎవరో క్రొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చందూని చూస్తూ అతని మాటల్ని కలలోలా వింటోంది’’
‘‘కాస్త దూరంగా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా?’’
నిమ్మ, మామిడి, జామ, అరిటి, సపోటా, కొబ్బరి తోటలు. మీ బొప్పాయి కూడా మిస్ అవలేదు. అవి కూడా. ఇంకేమైనా మరిచిపోయి వుంటే చెప్పు.. పెట్టించేద్దాం. ఆ! మరిచాను.. తమలపాకు, కరివేపాకు కూడా ఉన్నాయి.
మరో రెండేళ్లలో ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీలు కూడా ప్రారంభించాలని. అపుడు నీ పిల్లలు ఇక్కడే చదువుకోవచ్చు. ఏమంటావ్?’’
‘‘వరాలుమీద వరాలు దేముడు అడగకుండా ఇచ్చేస్తూ ఉంటే మాటలు ఎలా వస్తాయి?’’’
‘‘విశ్వా! నీ అపురూమపమైన ప్రేమముందు ఇవన్నీ బలాదూరే తెలుసా?’’
‘‘ఏడేళ్ళయితే భార్యలమీద ముఖం మొత్తుతుందంటారు. మరి అలాంటివి నీకేం లేవా?’’
‘‘నిన్ను తన్నాల్సిందే. అందరితో ఈ చందూని కలిపేస్తావా?’’ అంటూ ఆమె వెంట పడ్డాడు.
అతనికి దొరక్కుండా విశ్వ పరుగెడుతోంది. కాసేపటికి అలుపుగా అనిపించి చందూకి దొరికిపోయింది.
‘‘నీకో నిజం చెప్పనా? నువ్వు నాకు చందమామ లాంటిదానివి. ఆకాశంలో చందమామని పుట్టినప్పటినుంచీ చూస్తున్నాను. బోర్ కొడుతుందా? లేదే! నువ్వూ అంతే!’’
‘‘చందూ’’ అంటూ అతని ఎదపైవాలిపోయింది. రోజురోజుకూ పెరిగేదే వారి ప్రేమ. ఇంకా చెప్పాలంటే వారిది తరగని ప్రేమ.
‘‘అటు వెళ్లి ఆ తోటలు కూడా చూస్తావా?’’’
‘‘చూద్దాం. నువ్వంత కష్టపడి నా కోసం ఇంత చేస్తే నేను చూడటానికి కూడా కష్టపడకపోతే ఎలా?’’’
‘‘అయితే పద. వాటి వెనక్కి వెళితే ద్రాక్ష తోటలు. వాటి ప్రక్కనే కూరగాయలు, దుంపలు’’
‘‘ఇక దేనికీ మనం బయటకు వెళ్లక్కర్లేదన్నమాట’’
‘‘మన సామ్రాజ్యంలో దొరకనిది లేదు’’
‘‘ఇంటికి వెళ్ళగానే అత్తయ్యతో, మామయ్యతో పోట్లాడాలి’
‘‘ఎందుకు ఇంత ఆనందాన్ని నీకు అందించినందుకా?’’
‘‘కాదు.. ప్రేమలో ననె్నందుకు మించిపోయారని?’’
‘‘అమ్మ నీకోసం ఎంత ఆలోచించిందో తెలుసా? మామూలు మొక్కలయితే ఎదగటానికి, కాయటానికి టైమ్ తీసుకుంటాయని డబ్బులెక్కువైనా ఫర్వాలేదు, బోన్సాయి మొక్కల్నే వేయమంది. నీమీద ఎంత ప్రేమో చూడు..’’
చల్లని సాయంత్రం. చిరుగాలుల స్పర్శ. మృధుమధురంగా సంభాషిస్తున్న చందూ మాటలు. తను వేరే ప్రపంచంలో ఉన్నానేమో అనిపిస్తోంది. ఉన్నానేమో ఏమిటి నిజంగానే ఉంది. ఇదే తన కలల ప్రపంచం. ఇదే తన కలల ప్రపంచం.. అలా ఎన్నిసార్లు అనుకుందో!
అంతా తిరిగి చూసి వచ్చేటప్పటికి కాళ్ళునొప్పి పుట్టాయి.
అది గ్రహించిన చందూ ‘నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్లటానికి ఈ సేవకుడు ఎల్లవేళలా సిద్ధం’’ అంటూ గబుక్కున చేతులలోకి ఎత్తుకున్నాడు.
ఫర్వాలేదు, నడుస్తాను అంటున్నా వినటంలేదు.
‘‘అబ్బా! చందూ! ప్లీజ్ నా భారం నీ మీద మోపలేను.. దించు’’ అంటూ బలవంతంగా క్రిందకు దిగింది.
‘‘స్నాక్స్ తీసుకుందామా? బాగా అలసిపోయినట్లున్నావు?’’ అడిగాడు చందూ.
‘‘నీ మాటలతోనే కడుపు నిండిపోయింది చందూ’’ అంది.
‘‘అలాగంటే ఎలా? ఉండు.. ఇపుడే వస్తా అంటూ కారు దగ్గరకు వెళ్లి డిక్కీలోంచి ‘్ఫల్డింగ్ మేట్’ తెచ్చి పరిచాడు.
ఇక దానిమీదకు ‘మాయాబజార్’ సినిమాలో ఎస్.వి.రంగారావు ముందుకి అన్ని పదార్థాలు వచ్చినట్లు చకచకా హాట్ పాక్స్‌లోంచి ఐటెమ్స్ తీసి పెట్టాడు.
పేపరు ప్లేట్స్‌లో వాటిని సర్దాడు.
చల్లటి మంచినీళ్ళు రెడీ.
వేడి వేడిగా టీ కావాలన్నా ప్లాస్క్‌లో రెడీగా ఉంది.
‘‘విశ్వా! తినవా!’’ అంటూ వేడిగావున్న సమోసాను ఆమె నోటికి తనే అందించాడు.
చందూ ఏ పనిచేసినా ఎంతో ప్రణాళికాబద్ధంగా చేస్తాడు. అది తనకు ఎంతో నచ్చుతుంది.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ