డైలీ సీరియల్

విలువల లోగిలి-84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా ఒప్పుకుంటేనా తాము పెళ్లికి అంగీకరిస్తామని ఆడపెళ్లివారితో చెప్పి వారి అంగీకారం తీసుకోవటం గమనార్హం.
అలాగే సంవత్సరంలో ఒకరోజు అక్కడే గడుపుతామని, ఇష్టమయితే మీరు కూడా మా వెంట రావచ్చని, మమ్మల్ని అడ్డుకోవటానికి మాత్రం ప్రయత్నించరాదని మరో ఒప్పందం.
మేము మీ పెళ్లిళ్ళు ఎక్కడ జరిగినా వస్తామని ఆ కుటుంబం మొత్తం మాటిచ్చినా వాళ్ళు ఒప్పుకోలేదు.
ఇది మాకు బడి మాత్రమే కాదు దేవాలయం. మీరు అమ్మా నాన్నలే కాదు, మాకు సంబంధించినంతవరకూ మీరు మాకు దేవతలే. అందరూ ఒకేమాట మీద నిలబడటంతో సూర్యచంద్ర, విశ్వలు అంగీకరించక తప్పలేదు.
రోజురోజుకూ పెరిగిపోతున్న వారి అభిమానానికి వెలకట్టలేమనుకున్నారు ఇ ఇద్దరూ!
***
వాళ్ళు తమ పెళ్ళిళ్ళను అక్కడ చేసుకోవటమే కాకుండా విశ్వ, సూర్య చంద్రల పెళ్లి తాము చూడలేదు కాబట్టి వారికి తాము షష్ఠిపూర్తి మహోత్సవం జరిపిస్తామని పట్టుపట్టారు. అలాంటి వేడుకలు తనకిష్టం ఉండదని ఒప్పుకోలేదు విశ్వ.
ప్రతీ విషయంలో మేము మీ మాట విన్నాం. ఈ ఒక్కసారి మీరు మా మాట వినాల్సిందే. మా ముచ్చట కాదనటానికి వీల్లేదు. అలా ఒప్పుకోకపోతే మేం అసలు పెళ్లిళ్ళు చేసుకోవటమే మానేస్తాం అని పట్టుబట్టారు.
విశ్వకు దిగిరాక తప్పలేదు.
‘అమృత హృదయ నిలయం’ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడిపోయింది.
వయసు పెరిగినా వనె్నతగ్గని చందంగా సూర్య, విశ్వ ఒకళ్ళనొకళ్ళు పోటీ పడుతున్నారు అందంలో.
కొందరికి తెల్లగా వెంట్రుకలు మెరవటం కూడా ఆ వయసుకు అందమే అన్నట్లుంది ఆ జంట.
ఆ జంటను అలా పెళ్లి దుస్తులలో చూడటం అందరికీ కన్నుల పండుగగా ఉంది.
చక్కని చీరకట్టులో విశ్వ, పంచె, లాల్చీ, కండువాలో సూర్యచంద్ర మన సాంప్రదాయ దుస్తులలో మిలమిలా మెరిసిపోతున్నారు.
విదేశాల నుంచీ ఈ పెళ్లి చూడటానికే వచ్చిన లోగిలి విద్యార్థుల స్నేహితులు కళ్ళు ఆర్పటం మరిచి అక్కడ జరుగుతున్న వివాహ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. గౌరీపూజ పెళ్లికూతురితో చేయించటం, తర్వాత ఆమెను అన్నయ్యలు బట్టలు కూర్చోబెట్టుకొని తీసుకురావటం, జీలకఱ్ఱ బెల్లంపెట్టడం, మంగళసూత్రం కట్టించడం అంతా వింతగా చూస్తున్నారు.
చైతన్య ప్రక్కనే కూర్చున్నాయన ‘‘వాళ్లంతా మనవారిలా లేరే? ఎవరు? ఎందుకు వచ్చారు?’’ అని అడిగారు. ఆయన ఎప్పటినుంచో అడగనా వద్దా, అడిగితే ఏమనుకుంటారో అని సందేహపడుతూ ఉన్నాడు. చివరకు తన సందేహం తీర్చుకోవాలని అడిగేశాడు. వాళ్ళంతా అమెరికాలో వున్న మా స్నేహితులు. వాళ్ళకు మన పెళ్లిళ్ళు అన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలన్నా చాలా ఇష్టం. అందుకే చూడటానికి అంత దూరం నుంచీ వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడి అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మనవాళ్ళకు అనురాగాలూ, ఆప్యాయతలూ, అనుబంధాలు, ప్రేమలూ ఎక్కువ కదా. అందుకే మన వాళ్ళంతా వాళ్ళకి చాలా ఇష్టం. అసలు ప్రపంచ దేశాలో మన భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందే మన సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పగా ఉండటంవలనే కదండీ’’ అని వివరించింది.
‘‘అవును బాబూ విసుక్కోకుండా చక్కగా చెప్పావు. మనవాళ్ళకు పెద్దవాళ్లను గౌరవించటం బాగా తెలుసు. అందుకే వాళ్ళంతా మనల్ని ఇష్టపడతారు అని ఇపుడు తెలిసింది. మంచిది బాబూ. అడగగానే చెప్పావు. నువ్వు నూరేళ్ళు వర్థిల్లాలి’’ అన్నాడాయన మనస్ఫూర్తిగా.
పెద్దవాళ్ళ ఈ చల్లని దీవెనే పెరుగుతున్న ఈ పిల్లలకు శ్రీరామరక్ష. అందుకే పెద్దవారికి నమస్కరించి అక్షింతలు జల్లించుకొని వారి ఆశీస్సులు తీసుకోమని చెప్పటమే కాకుండా అలా చేయించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. పిల్లల ముందు తమకు ఆ వివాహ తంతు అం జరగటం చాలా సిగ్గుగా అనిపిస్తోంది విశ్వకు. పిల్లలు మాత్రం అదేమీ పట్టించుకోకుండా సూర్యచంద్ర, విశ్వప్రియలకు నమస్కారం చేసి వారి ఆశీర్వచనాలను అందుకుంటున్నారు. మరి ఇక్కడ వీళ్ళే పెద్దవారుగా.
పెళ్లిలో పెద్ద సందడి తలంబ్రాల కార్యక్రమం. పిల్లలందరూ సగం సగంగా విడిపోయి బోలెడు హంగామా సృష్టించి సూర్య, విశ్వలతో పోటీ పెట్టి మరీ ఆ కార్యక్రమానికి వనె్న తెప్పించారు.
తలంబ్రాలకు నిజం ముత్యాలు వాడటం అక్కడ మరో విశేషం.
సూర్యచంద్ర, విశ్వప్రియలకు తమ పెళ్లి వద్దని రిజిష్టరు మ్యారేజీ చేసుకోవటం గుర్తుకువచ్చింది. అనుకోకుండా వీళ్ళంతా పెళ్లి చేస్తామని గొడవ చెయ్యటంతో ఆ ముచ్చట ఇపుడు తీరింది అనుకున్నారిద్దరూ.
పెళ్లి వైభవంగా జరిగిందని అందరూ ఆనందిస్తున్న సమయంలో అంతకుముందే ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న అవార్డును అక్కడ పెళ్లిపీటలమీదే విశ్వప్రియకు బహూకరించటంతో అక్కడ అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
పిల్లలందరూ సూర్యచంద్ర, విశ్వప్రియ చుట్టూ చేరి సంతోషంతో నాట్యం చేశారు. విద్యార్థినీ విద్యార్థుల సందడి అక్కడ రాజ్యమేలింది.
తెలుగు జాతికే ఆ గౌరవం దక్కినట్లుగా అందరూ ఆనందపడ్డారు.
మన బిడ్డలు రత్నాలు కాబట్టే ఇలాంటి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకోగలుగుతున్నారని మరొకరు ప్రశంసించారు.
ఒక్కొక్కరూ వచ్చి ఆమెకు అభినందనలు అందజేశారు.
విద్యార్థులంతా ‘విశ్వ మేడమ్‌కి జై! విశ్వ మేడమ్‌కి జై!’ అంటూ జేజేలు పలికారు. వారికే ఆ బహుమానం వచ్చినంత ఆనందం వారందరిలో.
మన భారతదేశంలో ఇచ్చే అతి పెద్ద పురస్కారాన్ని అందుకున్నానన్న గర్వం రవ్వంత కూడా లేదు విశ్వలో.
ఊపిరి ఉన్నంతవరకూ తోటివారికి ఇలాగే సహాయం చేసే అవకాశం ఇవ్వు తండ్రీ అని భగవంతుడిని ప్రార్థించింది విశ్వ ఆ క్షణంలో కూడా! విశ్వకి తోడుగా నీడగా తానుండగలిగితే చాలనుకున్నాడు చందూ.
ఎప్పటికీ ఆ జంట అలా తోడూ.. నీడాగానే!
*
అయిపోయింది

-యలమర్తి అనూరాధ 9247260206