డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే( కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలకత్తాలోని కోర్టు ముందు శర్మిలాముఖర్జీ అవిశ్రాం తంగా తిరుగుతున్నది.
ఈమె షేక్‌స్పియర్ సరణి ప్రాంతంలో ఉండే ఫ్రీలాన్స్ జర్నలిస్టు. లాయర్ కూడా.
ఆ రోజు ఒక కేసు విచారణకు వచ్చింది. న్యాయమూర్తి ఋతుపర్ణ చటర్జీ ధర్మాసనం అధిష్ఠించారు.
శంఖపుష్పి అనే ముసలమ్మను బోనులో నిలబెట్టారు. ఆమె వయస్సు ఎనభై సంవత్సరాల పైమాటే.
శంఖపుష్పిపై హత్యాభియోగం మోపబడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలను వినిపించడానికి లేచాడు.

‘యువర్ ఆనర్!
ఈ శంఖపుష్పి హంతకురాలు అని నిరూపించడానికి తగిన సాక్ష్యా ధారాలు న్నాయి. అందుకని చట్టపరంగా ఆమెను శిక్షించవలసిందిగా కోరుతున్నాను’ అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
శర్మిలాముఖర్జీ లోపలికి వచ్చి తాను శంఖపుష్పి పక్షాన వాదించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది.
జడ్జి ఋతుపర్ణ చటర్జీ అంగీకరించాడు.
కోర్టు మొత్తం కిటకిట లాడుతూ ఉంది.
అంతా గుసగుసలాడుకుంటున్నారు.
‘ఆర్డర్ ఆర్డర్’ అంటూ జడ్జి హెచ్చరించాడు.
‘మీ వాదనలు మొదలుపెట్టండి’ అని జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోరాడు.
ఇలా కద మొదలయింది.
*****
హైదరాబాదులో బేగంబజార్ అనే ప్రాంతంలో ఒక లారీ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఉంది. దాని యజమాని దీపక్‌చందర్. అందులో గుమాస్తాగా విశ్వనాథ్ గోడ్బోలే పని చేస్తున్నాడు. ఆయన భార్యపేరు ఆమ్రపాలి. కుమార్తె పేరు శైలజ.
ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ పరిపాలించే రోజుల్లో హైదరాబాదు సంస్థానంలో కొంత కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా ఉండేవి. ఈ కారణం చేత బడీచావుడిలో కన్నడిగులు, బీగంబజార్ ప్రాంతంలో కొందరు మహారాష్ట్రులు కూడా నివాసాలు ఏర్పరుచుకొన్నారు.
1948లో సర్దారు వల్లభ్ భాయి పటేల్ నిజాం సంస్థానంపై పోలీసుచర్య జరిపిన తర్వాత హైదరాబాదు సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమయింది. కొన్ని జిల్లాలు కర్ణాటకలోను, మరికొన్ని మహారాష్టల్రోను కలిపివేశారు. ఐనా మహారాష్ట్రులు గణనీయమైన సంఖ్యలో తెలంగాణలోని హైదరాబాదు, నిజామాబాదు వంటి ప్రాంతాలల్లో స్థిరనివాసం ఏర్పరచు కొన్నారు.
విశ్వనాథ్ గోడ్బోలే చాలా ధార్మిక చింతన కలవాడు. ప్రతిరోజూ స్నానం, సంధ్య ముగించుకొని హనుమాన్ మందిర్‌కు వెళ్తాడు. అక్కడ నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాడు.
‘అష్టసిద్ధి నవనిధికే దాతా’ అంటూ గొంతెత్తి పాడుతాడు.
బయట బారులు తీరి కూర్చున్న బిచ్చగాళ్ళకు తృణమో, పణమో దానం చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఫలహారం చేస్తాడు. ఉదయం పదిగంటలకే పనిలో చేరుతాడు. అలా రాత్రి లారీ లోడ్ డిస్పాచ్ వరకు అన్నీ తానే స్వయంగా చూచుకుంటాడు.
ప్రొప్రయిటర్ దీపక్ చంద్‌కు విశ్వనాథ్ గోడ్బోలే మీద ఎంత నమ్మకమంటే పెద్ద పెద్ద మొత్తాలు విశ్వనాథ్‌కు ఇచ్చి బ్యాంకులకు పంపుతూ ఉంటాడు.
దీపక్‌చంద్, విశ్వనాథ్‌ను పిలిచి ఇలా చెప్పాడు.
‘‘ఇదిగో విశ్వం! నీకు జీతం ఇస్తున్నది ఎందుకో తెలుసా?’’
విశ్వం నవ్వి ‘‘నమ్మకంగా పనిచేస్తున్నం దుకు’’ అన్నాడు.
‘‘కాదు - నా కుటుంబ వ్యవహారాలు చూసేందుకు’’
విశ్వం, నిశ్శబ్దంగా, ప్రశ్నార్థకంగా యజమాని వంక చూచాడు.
‘‘విశ్వం! ఈ పార్థుగాడు బొత్తిగా బాధ్యతారహితంగా తిరుగుతున్నాడు. వీడిని మంచి మార్గంలో పెట్టవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను’’
విశ్వం నవ్వి, ‘‘సేట్‌గారూ! పులి కడుపున చలిచీమ పుట్టదు. మీ కొడుకు మీలాగే ప్రయోజకుడవుతాడే కాని జులాయిగా ఎందుకు తిరుగుతాడు?’’ అన్నాడు.
‘‘అది కాదయ్యా! వాడు తిరుగక పోయినా వాతావరణం అలా చేస్తుంది. నేను రాణా ప్రతాప్ వంశానికి చెందినవాడిని. కాని ఇవ్వాళ నాలో క్షత్రియధర్మం లేదు. మా మార్వాడీలంతా వడ్డీ వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నారు. దేశ కాల పరిస్థితులు మారాయి.
- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ 040-27425668