డైలీ సీరియల్

ఒయాసిస్ 52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్పిటల్‌కి ఫోన్ చేసి వీరాస్వామికి ఎంత ఖరీదైన ట్రీట్‌మెంట్ అయినా ఇవ్వాలని ఆదేశించారు. అతని బ్లడ్ గ్రూప్‌కి చెందిన రక్తం వున్న కానిస్టేబుల్‌కు తమ రక్తం ఇవ్వటానికి రెడీగా అక్కడే కూర్చున్నారు.
రణధీర్ బాంబు పేలిన చోటుకి వచ్చాడు. ఆ పార్సెల్ చాలావరకు కాలిపోయింది. కానీ ఒక మూల ఉన్న పోస్టల్ ముద్రమీద అతని దృష్టిపడింది. ఆ ముద్ర కూడా కాలిపోయి సగం మాత్రమే కనిపిస్తోంది. దాన్నిబట్టి ఆ పార్సెల్ జనరల్ పోస్ట్ఫాసు నుంచి రిజస్టర్ పోస్టు ద్వారా పంపించారని తెల్సిపోయింది.
ఒక గంట తర్వాత రణధీర్ జి.పి.ఓలో ఆ పార్సెల్‌ను పంపించిన రోజున రికార్డ్ అయిన సి.సి.కెమెరా పుటేజ్‌ని పరిశీలించాడు. ఆ పార్సెల్ కౌంటర్‌లో ఇచ్చిన బట్టతల వ్యక్తిని రణధీర్ గుర్తుపట్టాడు.
ఆ రోజు రాత్రి తననూ, దీప్తిని రియల్ ఎస్టేట్ వెంచర్‌లోని ప్లాట్టు చూపించటానికి తీసుకువెళ్లిన వ్యక్తి అతనేనని గుర్తుపట్టాడు.
రణధీర్ ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుల్స్ రియల్ ఎస్టేట్ ఆఫీసుకెళ్లారు. బట్టతల మేనేజర్ ముందు కూర్చున్నారు. తాము రెండు ప్లాట్లు కొనటానికి వచ్చామని చెప్పారు. రాత్రికి అమెరికా వెళ్తున్నామనీ, టైం లేదనీ, ఇప్పుడు ప్లాట్లు చూపిస్తే ఫుల్ పేమెంట్ చేస్తామని అన్నారు. నలుగురు ఎన్.ఆర్.ఐల చేత కొనిపిస్తామని ఆశపెట్టారు. బట్టతల మేనేజర్ సంతోషంగా వాళ్ళకు ప్లాటు చూపించటానికి బయల్దేరాడు.
ఆ ఆఫీసు బయటకు రాగానే ఆ మేనేజర్ని జీపులోకి తోసి ఇద్దరూ చెరోవైపు కూర్చున్నారు. కదిలితే కాల్చి పారేస్తామన్నారు.
ఆ మేనేజర్ని రణధీర్ దగ్గరకు తీసుకెళ్ళారు.
‘‘ఆ పార్సెల్ పోస్ట్ఫాలోని కౌంటర్‌లో ఇచ్చి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించింది నువ్వేనా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘అవును సార్...’’ అన్నాడు మేనేజర్.
‘‘నీకెవరిచ్చారు ఆ పార్సెల్..’’
‘‘మా ప్రొప్రయిటర్‌గారు రాజశేఖర్‌గారు..’’
‘‘ఆయన ఎక్కడ నీకా పార్సెల్ ఇచ్చాడు. ఇంట్లోనా, ఆఫీసులోనా, కార్లోనా, దార్లోనా?’’
‘‘ఇంట్లో సార్..’’
‘‘ఇంటికి నిన్ను పిలిపించారా?.. రోజూ వెళ్తుంటావా?’’
‘‘రోజూ వెళ్ళనండి.. ఏదన్నా ముఖ్యమైన పని ఉంటే ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంటారండి..’’ అన్నాడు మేనేజర్.
‘‘ఆ పార్సెల్ నీకు ఇచ్చినపుడు మీ ఆఫీసు వాళ్ళుగానీ, ఇతరులుగానీ ఎవరైనా ఉన్నారా?
‘‘ఎవరూ లేరండి.. ఆయనొక్కరే ఉన్నారు..’’
‘‘ఏం చెప్పారు?’’
‘‘జి.పి.ఓకి వెళ్లి రిజిస్టర్ పోస్టులో పంపించి రమ్మన్నారండి..’’
‘‘రిజిస్టర్ చేసిన తర్వాత రసీదు ఇస్తారు గదా.. అది నీ దగ్గరే ఉందా? ఆయనకి ఇచ్చావా?’’’
‘‘రసీదు తెచ్చి ఇయ్యమన్నారండి.. అందుకని తీసుకెళ్లి ఆయనకు ఇచ్చానండి..’’ అన్నాడు మేనేజర్.
‘‘ఆ పార్సెల్‌లో ఏముందో తెల్సా? నీకు?’’
‘‘తెలియదండి..’’’
‘‘దానిమీద అడ్రసు చూశావా?’’
‘‘చూశానండి..’’
‘‘ఏముంది?’’
‘‘శ్రీ రణధీర్, ఇన్స్‌పెక్టర్.. క్రైం ఇనె్వస్టిగేషన్ డిపార్ట్‌మెంట్..’’ అని ఉందండి..’’
‘‘నీకేం అనుమానం రాలేదా?’’
‘‘రాలేదండి.. ఆయన చెప్పిన పని చెయ్యడమేగానీ, ఎందుకు, ఏమిటి అని ఆయన్ని అడిగే ధైర్యం మా ఆఫీసులో వాళ్ళకెవరికీ లేదండి..’’ అన్నాడా మేనేజర్.
‘‘వీడ్ని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళి లాకప్‌లో పడెయ్యమని చెప్పు... వీడి దగ్గర సెల్‌ఫోన్ తీసుకుని నీ దగ్గర పెట్టుకో.. ఎవడన్నా కాల్ చేసినా రెస్పాన్సు ఇవ్వకు..’’ అని రణధీర్ కానిస్టేబుల్‌కి చెప్పాడు.
డి.జి.పి ఆఫీసులో ఉన్నతాధికారుల మీటింగ్ ప్రారంభమైంది. రణధీర్‌ని రమ్మన్నారు.
రణధీర్ ఆ మీటింగ్‌కి వెళ్ళాడు.
‘‘ఏంటి? ఏం జరుగుతోంది..? మన ఆఫీసుకు బాంబ్ పార్సెల్ చేసే దమ్ము ఎవడికి ఉంది? ఇది రేపు బయటకు పొక్కితే మన డిపార్ట్‌మెంట్ పరువు ఏమవుతుంది?’’ అని అడిగాడు డి.జి.పి.
‘‘సర్.. ఆ పార్సెల్ ఎవరు పంపారో తెల్సిందండీ..’’ అన్నాడు రణధీర్.
‘‘ఎవడు వాడు?’’’
‘‘రాజశేఖర్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రొప్రయిటర్.. ఈయనకి చిట్‌ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి.. ఇవిగాక డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటాడు..’’ అన్నాడు రణధీర్.
‘‘మన ఆఫీసుకి బాంబు ఎందుకు పంపించాడు?’’ అని అడిగాడు ఆయన.
‘‘డాక్టర్ శే్వత మర్డర్ కేసు నేను ఇనె్వస్టిగేషన్ చేస్తున్నాను.. ఆ కేసులో ఇతను దాదాపుగా మొదటి ముద్దాయి అన్న నిర్ణయానికి నేను వస్తున్నట్లు గ్రహించాడు. నన్ను చంపేస్తే ఈ ఇనె్వస్టిగేషన్ ఇంతవరకు నేను సేకరించిన సమాచారాన్ని అంతా అణిచి పెట్టేసినట్లవుతుందని, నన్ను టార్గెట్ చేస్తూ బాంబు పార్సెల్ నాకు పంపించాడు.
దానిమీద ‘పర్సనల్’ అనీ, ‘గిఫ్ట్’ అనీ రాయించాడు. ఎవరో గిఫ్ట్ పంపించారన్న ఉద్దేశ్యంతో ఆ పార్సెల్ నేను ఓపెన్ చేస్తాననీ, వెంటనే అది నా మొహం మీద బ్లాస్ట్ అవుతుందనీ, నేను చనిపోతాననీ, తాను నిరపరాధిగా నిర్దోషిగా, సమాజంలో ప్రముఖ వ్యాపారస్తుడిగా మిగిలిపోవచ్చనీ ప్లాన్ వేశాడు..’’ అని చెప్పాడు రణధీర్.
‘‘ఓ.కె. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావ్?’’
‘‘చుట్టూ వున్న పరిస్థితులను బట్టి రాజశేఖర్ దోషి అని నిర్థారించవచ్చు. అయితే కోర్టులో అతను హంతకుడుగా రుజువు చెయ్యగలమా అన్న సందేహంలో ఉన్నాను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద అతను తప్పించుకునేందుకు అవకాశం లేకపోలేదు.

- ఇంకా ఉంది

శ్రీధర