డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని గొంతు మృదువుగానూ, మెల్లగానూ ఉండటంతో జనం ఎక్కువగా హర్షించలేదు. వారికి ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు కావాలి. జనాలను రెచ్చగొట్టే ప్రసంగాలు కావాలి. గోడ్బోలే మాటలు ఉప్పులేని పప్పులా చప్పగా ఉన్నాయి.
ఆ తర్వాత విజయవాడ నుండి వచ్చిన ఒక నాయకుడు ఉద్రేకపూరితమైన ప్రసంగంతో సభను బాగా ఆకట్టుకొన్నాడు. అతనికి తెలుగు సాహిత్యంతో బాగా పరిచయం ఉంది. అందుకని కొన్ని పాటలు, పద్యాలు, కవితలు వినిపించాడు.
‘‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది - పదండి ముందుకు పదండి తోసుకు - పోదాం పోదాం పైపైకి’’ అని పాడాడు. జనంలో ఉత్సాహం వెల్లివిరిసింది.
‘‘ధనవంతుల దౌర్జన్యాలు ఇంకానా? ఇకపై సాగవు’’ అని గర్జించాడు.
‘‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది - డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతుంది’’ అని ఓ తెలుగు కవి వ్రాసిన కవిత వినిపించేసరికి జనం చప్పట్లు కొట్టారు.
విప్లవాలు ఎర్ర ఎర్రగా వస్తాయిరా బ్రదర్ అంటూ అరిచాడు.
పేదవాడి శ్రమ బిందువులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ అని ఓ కవిత చదివాడు.
ఈయన ఉపన్యాసం జనాన్నిబాగా ఆకర్షించింది.
ఆ తర్వాత పార్థూను మాట్లాడవలసిందిగా కోరారు.
అతడు లేచి ‘‘అందరికీ నమస్కారం, వణక్కం, అస్సలాం లేకుం-ఆదాబర్సే’’ అన్నాడు.
‘‘మీ ప్రసంగాలు వినడానికి వచ్చానే కానీ నేను ఉపన్యాసాలు, సందేశాలు ఇచ్చేవాణ్ణి కాదు. కాకపోతే ప్రతీమనిషికి నిజాయితీ ఉండాలి అని మాత్రం నా మతం. అదే నా అభిమతం.
ఇంతకూ నిజాయితీ అంటే ఏమిటి? పేదల ప్రజల కన్నీళ్లను వ్యాపారపు ముడి సరుకుగా మార్చుకొని డబ్బు సంపాదించి జల్సాలు చేయడం హిపోక్రసీ-
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీచాన బుగ్గ మీద గులాబిరంగు ఎలా వచ్చెనో తెలుపగలవా? అని పాట రాసి ఆ డబ్బుతో మద్యం సేకరించి చీట్లాడి గుర్రపు పందాలకు వెళ్లడం నిజాయితీ అంటారా?
ఆలికి కూడు పెట్టనివాడు అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం హిపోక్రసీ - ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుళ్లు మొదలాలి (ముందడుగు) అంటూ మద్రాసులో ఉద్యమాలు నడపడం హిపోక్రసీ-
విజయవాడ నుండి వచ్చిన ఈ నాయకునికి భార్య పేరు మీద వంద ఎకరాల ఆస్తి నూజివీడులో ఉంది. కొడుకు అమెరికాలో డాక్టరుగా పనిచేస్తున్నాడు. ఇదిగో దీనినే హిపోక్రసీ అంటారు. మీ ఉపన్యాసాలు కంఠశోష - శుంఠఘోష- మీరు చెప్పిందేదో చేయండి. మీ ఉపన్యాసాలు మందికోసం మీరు బతికేది మాత్రం మందుకోసం. దీనినే హిపోక్రసీ అంటారు.
మీ శరీరం మీదనే మీకు స్పృహ ఉండదు. మీరు సామాజిక స్పృహ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?’’ పార్థు ప్రసంగం ఇలా సాగింది.
దానిని శ్రోతలలో ఒక వర్గం వారు అడ్డుకున్నారు. దిగిపో - దిగిపో డౌన్ డౌన్ అంటూ కేకలు వేశారు.
‘‘మీరు పొమ్మనకముందే నేను వేదిక మీది నుండి నిష్క్రమిస్తున్నాను. మిమ్ము బహిష్కరిస్తున్నాను’’ అంటూ పార్థూ సభ నుండి పారిపోయాడు.
సభలో గందరగోళం చోటు చేసుకుంది.
పార్థును సురక్షితంగా సభాస్థలినుండి గోడ్బోలే ఇంటికి చేర్చాడు.
*****
తంగిరాల శ్రీరామశర్మ గారి వద్దకు పార్థు, గోడ్బోలే వెళ్లారు.
ఆయన ఏదో భూతవైద్యం చేస్తున్నాడు. ఎవరికో క్రైస్తవ దయ్యం పట్టిందట. రాత్రివేళల్లో ‘నేను ఏసు ప్రభువు శిలువను’’ అంటూ ఆ అమ్మాయి అరుస్తూ ఉంటుంది. ఆమెకు క్రైస్తవ పద్ధతిలో చిక్సిత చేయించారు. ఐనా నయం కాలేదు. సరేనని హిందూ పద్ధతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఆ అమ్మాయిని చూచేసరికి పార్థూ లేచి నిలబడి నాకు తురక దయ్యం పట్టింది అంటూ గెంతడం మొదలుపెట్టాడు. గోడ్బోలే అతనిని శాంతింపజేసి కూర్చోబెట్టాడు.
తంగిరాల సిద్ధాంతి కొంతసేపటి తర్వాత ‘ఏమిటీ సేటు ఈ విచిత్ర ప్రవర్తన?’ అని ప్రశ్నించాడు.
అప్పుడు గోడ్బోలే జరిగినదంతా చెప్పాడు. తాను చేవెళ్ళకు వెళ్ళటం, అక్కడ ఒక రాత్రి నిరీక్షణలో గడపటం, సెక్రటరీని దయ్యాలు చంపటం అంటూ చెప్పాడు.
అప్పుడు తంగిరాల సిద్ధాంతి ఇలా అన్నాడు.
‘‘ఈ పిల్లవాడికి దయ్యం పట్టిన లక్షణాలు ఏమీ లేదు. కేవలం మనలను ఎగతాళి చేయడం కోసం ఇట్లా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు కావాలని అనుకుంటున్నాడు కదా! అందుకని నా ముందే నాటకం రిహార్సల్ వేసుకుంటున్నాడు’’
అప్పుడు విశ్వనాథ్ గోడ్బోలే ఇలా ప్రశ్నించాడు -
‘‘ఇంతకూ దయ్యం పట్టడం అంటే ఏమిటి సిద్ధాంతి గారూ?’’
‘‘అదొక రకమైన మానసిక పరిస్థితి. మనస్సు ద్రవరూపంలో ఉంటుంది. అందులో ఏవేవో రసాయనిక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. నరాల వలన కండరాలవలన ఇతర ఆహార వ్యవహారాల వలన వచ్చిన లోపాలు మనస్సుపై ప్రభావం చూపుతాయి. ఇక భూత ప్రేత పిశాచాలు ఉన్నాయో లేవో నాకు కూడా ఖాయంగా తెలియదు. పరంపరాగతంగా ఆనువంశికంగా ఇలా నేను నాకు సంక్రమించిన విద్యను వినియోగించుకుంటున్నాను. ఈ అమ్మాయిని చర్చిలో ఎవరో ఏదో చేశారు.

- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్