డైలీ సీరియల్

ఒయాసిస్ 56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సాధారణంగా మేం కేసు విచారణ చేస్తున్నప్పుడు అవసరమైన సమాచారం రాబట్టడం కోసం రకరకాల పద్ధతుల్లో వాళ్ళను కలుస్తుంటాం.. చక్రపాణి అనే సినిమా ప్రొడ్యూసర్‌గా ఆయనకు పరిచయం అయి, ఆయన ప్రైవేటు లైఫ్ గురించి తెల్సుకున్నాను..
చివరలో నేను పోలీసు ఇన్స్‌పెక్టర్‌గా ఆయనకు పరిచయం అయి, ఆయన ప్రైవేటు లైఫ్ గురించి తెల్సుకున్నాను.. చివరలో నేను పోలీసు ఇన్స్‌పెక్టర్‌నని ఆయనకు తెల్సింది. ఆయన రహస్య జీవితం గురించి బయటపెడతానన్న అనుమానం ఉన్న వాళ్ళని ఎవరినీ వదలడు. నాకొక గిఫ్ట్ రూపంలో పార్సెల్ బాంబు పంపించి.. నన్ను చంపే ప్రయత్నం చేశాడు. నేను చనిపోతే, శే్వత హత్య కేసులో ఆయన పాత్ర బయటకు రాదు.. కానీ నాకింకా భూమీద నూకలు నిండుకోలేదు. నేను ఆయన అనుకున్నట్లు చావలేదు.. ఆయన్ను నా వెనక నిలబెడితే, ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతానన్నందుకు నామీద పడి పీక పిసికి చంపాలని చూసినా ఆశ్చర్యం లేదు.. మేం ఎలాంటి రిస్కూ తీసుకోదలచలేదు..’’ అని నవ్వాడు రణధీర్.
అంతటితో మీడియా సమావేశం ముగిసింది.
అందరూ ఎటువాళ్ళు అటు వెళ్లిపోయారు.
రణధీర్ తన గదిలోకి వెళ్లి టీ తాగుతున్నాడు. అహోబలరావు ఫోన్ చేశాడు.
‘‘చాలా థాంక్స్.. కనీసం ఇప్పుడన్నా శే్వత ఆత్మ శాంతిస్తుందని ఆశిస్తాను..’’ అన్నాడు అహోబలరావు.
‘‘నేను కూడా మీకు థాంక్స్ చెప్పాలి.. పరిశోధన చేస్తున్న సమయంలో ఒకటికి రెండుసార్లు మిమ్మల్ని కల్సి విసిగించాను..’’ అన్నాడు రణధీర్.
‘‘శే్వత బతికి ఉండగా నాకు ఎంతో సేవ చేసింది. నన్ను చిన్న పిల్లాడిలాగా చూసుకుంది.. దానికోసం ఆ మాత్రం చేయలేనా? అది గుర్తుకురాని క్షణం లేదు..’’ అన్నాడు అహోబలరావు.
‘‘ఆమె ఎక్కడికీ పోదు.. పోలేదు.. భార్యాభర్తలన్నాక శరీరాలు వేరైనా, ఆత్మ ఒక్కటే.. ఆమె మీలోనే ఉంది.. ఉంటుంది..’’ అని ఆయనను ఊరడించే ప్రయత్నం చేశాడు రణధీర్.
ఛాయ ఫోన్ చేసింది.
‘‘ఈ కేసును మీరు పరిష్కరించినందుకు థాంక్స్..’’ అన్నది ఛాయ.
‘‘నా డ్యూటీ నేను చేశాను.. అన్నట్లు మీరిచ్చిన ఐదు లక్షలూ నా దగ్గర అలానే ఉన్నాయి.. రేపు మీకు పంపించేస్తాను..’’ అన్నాడు రణధీర్.
‘‘ఎందుకంత నిర్దయ? నా ఈ ఎడారి జీవితంలో నాకు ఒక ఒయాసిస్‌లా కనిపించారు. మంచి స్నేహితుడు దొరకాడని తృప్తిపడ్డాను.. ఆ తృప్తినీ మిగలనివ్వరా? ఇంతకీ మీరు నాకు ఏమవుతారు?.. ఎంతకీ అర్థం కారు..’’ ఛాయ ఏడుపు వినిపించింది రణధీర్‌కి.
దీప్తి ఫోన్ చేసింది. రణధీర్ అన్నాడు.. ‘‘సారీ దీప్తి.. నేనొక సినిమా ప్రొడ్యూసర్‌నని నీతో అబద్ధం చెప్పాను.. గొప్ప హీరోయిన్‌ని చేస్తానని లేనిపోని ఆశలు కల్పించాను.. నీ ఆశలన్నీ అడియాశలే అయినందుకు ఎంతో నిరాశ పడుతున్నావో ఊహించుకోగలను..’’
‘‘చాలా కొద్ది రోజుల పరిచయంలోనే మీ నుంచి ఎన్నో తెల్సుకున్నాను.. ఎంతో నేర్చుకున్నాను.. డబ్బును సంపాదించటం కోసం ఎండమావుల వెంట పరుగులు తీయాలని ప్రయత్నించి బొక్క బోర్లా పడిపోయి, భూమాతకు సాష్టాంగ పడ్డాను. మీరు నోరు విప్పి చెప్పిన విషయాలకన్నా, చెప్పని విషయాలే ఎక్కువ.. ఇక నుంచీ ఎలాంటి తప్పుడు పనులూ చేయనని వాగ్దానం చేస్తున్నాను.. నాకొక సన్మార్గం చూపించి, ఆ దారంట నడవమని చెప్పకనే చెప్పినందుకు కృతజ్ఞతలు.. మీకు నేనేమివ్వగలను? రెండు కన్నీటిబొట్లు మీ పాదాల దగ్గర సమర్పించాలని ఉంది.. అందులో జీవితానికి సరిపడే తృప్తి ఉంటుంది. ఇంక మీరు నాకు కనిపించరు. నాకు తెల్సు, అయినా మీరే నాకు గురువులు.. ఒక రాత్రి పూట నేను నా భవిష్యత్తు గురించి భయపడి చివురుటాకులా వొణికిపోయిన అర్థరాత్రి పూట అక్కున చేర్చుకుని పసిపిల్లను లాలించినట్లు లాలించి, ధైర్యం చెప్పిన ఆప్తులు.. పరమాత్ములు..’’ దీప్తి వెక్కి వెక్కి ఏడవటం విని, రణధీర్ చిన్నగా నవ్వుకున్నాడు.. చేతిలోని పేపర్ వెయిట్‌ని గుండ్రంగా తిప్పాడు. అది కొంచెం సేపు తిరిగి ఆగిపోయింది. అంతే మరి.. ఏదయినా..
అహోబలరావు, శే్వత, రాజశేఖర్, దీప్తి, ఛాయ ఎవరి జీవితంలో వాళ్ళకు ఎదురైన ఆశల ఒయాసిస్‌లను అందుకోవాలని పరుగులు తీశారు. కానీ వాళ్ళ ఆశలు అడియాశలే అయ్యాయి.

సమాప్తం

శ్రీధర