డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్తార్ సింగ్ నవ్వాడు.
‘‘జోక్ కాదు గానీ నిజంగానే చెబుతున్నాను. ఈ నాటకం రహస్యంగా ఆడాలి తెలిసిందా!’’
దీపక్‌చంద్‌కు ఫోన్ వచ్చింది.
‘‘ఎవరు మాట్లాడుతున్నారు?’’
‘‘నా పేరు షంషీర్’’
‘‘ఏం కావాలి?’’
‘‘రెండు లక్షలు’’
‘‘దేనికీ?’’
‘‘అది నీకు అనవసరం. మీ అసిస్టెంటు గోడ్బోలేకు ఇచ్చి భువనగిరికి వెళ్లే దారిలో కొర్రేముల్ వద్దకు రేపు సాయంత్రం రావాలి. ఎవరైనా పోలీసులకు చెబితే నీ కొడుకు ప్రాణాలకు హాని ఉంది’’
‘‘పార్థు ఎక్కడ ఉన్నాడు?’’
‘‘మా చెరలో ఉన్నాడు’’
‘‘మీరు ఎక్కడినుండి మాట్లాడుతున్నారు?’’
‘‘అవన్నీ మీకు అక్కరలేదు. ఒక్క క్షణం మీ కొడుకుతో మాట్లాడు’’
ఫోన్ పార్థూకు ఇచ్చాడు.
‘‘పితాజీ! నేను పార్థూను మాట్లాడుతున్నాను’’
‘‘పార్థూ! ఎక్కడ ఉన్నావు?’’
‘‘నన్ను ఎవరో బందీ చేశారు. వారికి డబ్బు కావాలిట. అది ఇస్తే వదలిపెడతాము అంటున్నారు’’
‘‘పార్థూ! సురక్షితంగా ఉన్నావా?’’
‘‘ఉన్నాను పితాజీ!’’
‘‘్భజనం చేశావా?’’
‘‘తిన్నాను. డబ్బు తొందరగా పంపించి నన్ను విడిపించండి’’
ఫోన్ పెట్టేశారు.
దీపక్‌చంద్ వెంటనే విశ్వనాథ్‌ను పిలిచి తనకు వచ్చిన ఫోన్ గూర్చి చెప్పాడు.
‘‘సర్‌ నాకు కూడా ఇలాగే ఫోన్ వచ్చింది’’ అన్నాడు విశ్వనాథ్.
‘‘ఏమిటిదంతా?’’
‘‘అదే ఆలోచిస్తున్నాను’’
‘‘పోలీసులకు ఫోన్ చేద్దామా?’’
‘‘దాని వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయేమోనని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పని ఎవరో తెలిసినవారు చేస్తున్నారు’’
‘‘తంగిరాల సిద్ధాంతిని పిలుద్దామా?’’
‘‘వద్దు - ఆయన చేయగలిగింది ఏమీ లేదు’’
‘‘ఈ గండం ఎలా గట్టెక్కాలో చెప్ప గలడు’’
‘‘మనం ఈ రకం బెదిరింపులకు లొంగితే రేపు మళ్లీ మరో డిమాండ్‌తో వస్తారు. ఇంతకూ ఈ కుట్ర వెనుక ఎవరున్నారో చూడాలి’’
‘‘మనకు శత్రువులెవరుంటారు?’’
‘‘మీరు ఎవరినీ శత్రువులుగా భావించడం లేదు కాబట్టి ఇతరులు మిమ్మల్ని శత్రువుగా భావించకూడదు అని ఎక్కడ ఉంది?
మనం హుస్సేనీ ఆలం వద్ద వికలాంగుల పాఠశాల నడపటం చాలామందికి ఇష్టం లేదు. ఆ భూమి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్లుండి ఒక చోట హనుమాన్ విగ్రహం వెలుస్తుంది. ఓ భూమిలో శిలువ పాతుతారు లేదా ఎర్రజెండా పాతుతారు. ఈ భూకబ్జాలు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నది? అంటే జనాభా పెరుగుదల అని సామాజిక శాస్తవ్రేత్తలు సమాధానం చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం?’’
‘‘నాకేమీ తోచడం లేదు’’
‘‘కొంచెం ఆలోచించనివ్వండి - ఇది భూకబ్జాకు సంబంధించిన కేసులా ఉందా? లేదా? పార్థును బంధించింది ఎవరు? ఫోన్‌లో అతను మాట్లాడినప్పుడు గొంతులో ఆందోళన కన్పించలేదు’’
‘‘అంటే..?’’
‘‘అదే ఆలోచిస్తున్నాను. ఇందులో ఏదో నాటకం ఉంది. రేపు నేను డబ్బు తీసుకొని కొర్రెమల్ పొలాల దగ్గరికి వెళ్తాను. ఏం జరుగుతుందో చూద్దాం’’
దీపక్‌చంద్‌కు ధైర్యం చాలడం లేదు.
విశ్వనాథ్ గోడ్బోలేకు మాత్రం ఇది పార్థూ ఆడిస్తున్న నాటకం అని అంతశ్చైతన్యంలో స్ఫురించింది.
దీపక్‌చంద్ కంటతడి పెట్టాడు.
‘‘మీరు సత్పురుషులు. కన్నీరు పురుష లక్షణం కాదు’’
‘‘వెళ్ళి సిఐడి శ్రీ్ధర్‌ను కలువు’’
‘‘వద్దులెండి. నేనే రేపు కొర్రెముల్ వెళ్తాను’’
‘‘డబ్బుతోనా?’’
‘‘ఔను నోట్ల కట్టలతో! కానీ అందులో తెల్ల కాగితాలుంటాయి. పైన కింద మాత్రం ఒక వంద రూపాయల నోటు ఉంటుంది’’
‘‘ఏదైనా ప్రమాదం జరిగితే?’’
‘‘రహస్యంగా పిస్టల్ తీసుకొని పోతాను’’
‘‘విశ్వనాథ్! నీకు పిస్టల్ కాల్చడం చేతనౌతుందా?’’
‘‘అదేమైనా బ్రహ్మవిద్యయా సేట్‌గారూ!’’
‘‘ఏమో! రేపు రాత్రిలోగా పార్థూ ఇంట్లో ఉండాల’’
‘‘ప్రయత్నం చేస్తాను’’ అన్నాడు విశ్వనాథ్.
అలాగే మర్నాడు విశ్వనాథ్ ఓ సూట్‌కేసులో నోట్లు పెట్టుకొని కొర్రెముల్ చేరాడు.
పొలంగట్టు వద్ద నిలబడ్డాడు. కొంతసేపటికి అటువైపు ఓ రైతు వెళ్తూ కన్పించాడు. విశ్వనాథ్ ఏమీ మాట్లాడలేదు.
రైతు దగ్గరికి వచ్చి ‘‘మీతో పాటు ఎవరు వచ్చారు?’’ అని ప్రశ్నించాడు.
‘‘నేనొక్కణ్ణే వచ్చాను’’
‘‘డబ్బు తెచ్చారా?’’
‘‘తెచ్చాను’’
‘‘అక్కడ పెట్టి వెళ్లిపో’’
‘‘పార్థూను నాతో పంపండి’’
‘‘అలా పంపము. డబ్బు మా బాస్‌కు చేరాక వదలిపెడతాము’’
‘‘మీ బాస్ ఎవరు?’’
‘‘అది నీకు అనవసరం’’
‘‘పార్థూను నా వెంట పంపితేనే డబ్బు ఇస్తాను’’
‘‘ఇవ్వకపోతే నీవు చస్తావు, పార్థూ చస్తాడు’’
‘‘మాట తప్పవద్దు - పార్థూను వదలిపెట్టండి’’
‘‘అరే! క్లర్కువు నీకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?’’ అని సూట్‌కేసును రైతు గుంజుకున్నాడు.
వెంటనే విశ్వనాథ్ రైతుపై కాల్పులు జరిపాడు. పొలం గట్టు మీద రైతు పడిపోయాడు.
ఇది చూచి ఎవరో చెట్టుచాటు నుండి పారిపోవటం విశ్వనాథ్ గమనించాడు.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి