డైలీ సీరియల్

దూతికా విజయం-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలల్లో జరిపే ప్రణయంలాగు అంతా తనకే సానుకూలంగా వుండి ఊపిరి పీల్చుకునే సావకాశం కూడా లేకుండానే అనుభవం అందుబాటులో ఉంటుందనుకుంటున్నట్లున్నాడు పిచ్చి బ్రాహ్మడు!
‘‘నాపాటికి నాకు చిన్నరాణి మందిరం మాత్రమే తెలుసు. రాజుగారి ప్రసాద ప్రాంగణం నాకు కాదు కదా ఆయన ప్రియ కళత్రమైన మా చిన్నరాణిక్కూడా తెలియదు. ఎందుకంటే అవసరమనుకుంటే రాజే రాణివాసానికి వస్తారే కాని ఆమె ఎటూ పోదు. విచ్చుకత్తులతో మెలకువగా కాపలా కాచే యోధానయోధుల కంటబడకుండానో, లేక ఏ ఒక్కరి ఆశ్రయించో, ఏ కటిక చీకటి రాత్రో లోపలికి జొరబడాలి!’’ అన్నది సరస్వతి.
విచ్చుకత్తులూ, యోధులూ, కట్టుదిట్టాలూ, కటిక చీకటి మొదలైన పదాల తాకిడికి వీరభద్రుని మానసంలోని మదనగోపాలుడు బాలగోపాలుడుగా మారుతున్నట్లుంది.
‘‘ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకోవాలి. అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పటికీ తెలివిగా, చురుకుగా తప్పించుకోవాలి. పట్టుబడితే కాకులకూ, గద్దలకూ మాంసపు విందుకోసం శరీరం ఖండ ఖండాలు అవుతుందనే మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆకొన్న సింహం గుహలోనికి వెళ్ళి సురక్షితంగా తిరిగి రావటంలాంటిదనుకోండి..’’
స్వామి ఆజ్ఞే అవుగాక- ఇంత ప్రాణాపాయాన్ని ఎలా ఎదుర్కోవటం? వీరభద్రుడు క్షణక్షణానికి కుంగిపోతున్నట్లు కనిపించాడు.
‘‘అంత నిరాశ పడనవసరంలేదులెండి’’ అన్నది సరస్వతి. మొదట్లోనే జారుకుంటాడేమోననే భయం పట్టుకున్నదామెను.
‘‘మీకేం! మీరు విచ్చుకత్తుల వెనుక సురక్షితంగా ఉంటే, నేనేమో వాటిని సూటిగా ఎదుర్కోవద్దా?’’ అన్నాడు వీరభద్రడు నిరాశాతరంగాలు గొంతుల కొట్టాడుతూన్నట్లు.
‘‘మీ క్షేమం మా క్షేమం కాదా? మీరు పట్టుబడితే మేమూ పట్టుబడినట్లే కదా! మీతోపాటే మాకూ శిక్ష పడి తీరుతుంది. అందుకని అన్ని కట్టుదిట్టాలూ ఏర్పరిచే మిమ్ము రాణివాసానికి జేరేస్తాను!’’
నిరాశ ఆశగా మారుతోంది మళ్లీ. ఆ కట్టుదిట్టాల వివరాలేమిటో తెలుసుకొని నిర్ణయించుకుందామనుకున్నాడు వీరభద్రుడు. ఇందాకటి తొందర చాలావరకు చప్పబడింది.
‘‘ఎలా పథకం వేయబడిందో కాస్త చెప్పు!’’ అన్నాడు వీరభద్రుడు. తెలివైన వ్యక్తిని పరీక్షించే నిమిత్తం అశనిపాతంలాంటి ప్రశ్న ఎంతో సులభంగానూ, మృదువుగానూ ధ్వనింపజేస్తున్నట్లు!
‘‘కటిక చీకటి రాత్రి రుూ సమావేశం ఏర్పరచబడుతుంది. శృంగారానికి చందమామా, వెనె్నల వెలుగూ మొదలైనవి హంగు ఐనప్పటికీ రుూ పరిస్థితుల్లో మాత్రం చీకటే రక్ష!’’
‘‘ఏమీ కనిపించదు కదా- ఎట్లా?’’
‘‘జారులకూ, చోదులకూ, చారులకూ అనువైన వాతావరణం చీకటి. మనకేమీ కనిపించని మాట నిజమే! అదేవిధంగా ఇతరులకూ మనం కనిపించం గదా! దారి అంతా నాకు ఎంతో పరిచయమున్నది కనుక, కళ్ళు మూసుకొని నేను మిమ్ము రాణివాసానికి భద్రంగా తీసుకొని వెళ్ళగలను. తిరిగి తీసుకొచ్చి మిమ్ము కోట దాటించనూగలను- నిశితంగా, స్పష్టంగా చూడగల నా నయనాలే మీ నయనాలు!’’
‘‘ఆ కాసేపూ నేను గుడ్డివాణ్ణన్నమాట!’’
‘‘ఔను, ప్రేమే గుడ్డిదంటారు కదా! ప్రణయాధిక్యతనూ తీవ్రతనూ బట్టే కళ్ళమీద పొరల మందం ఏర్పడుతుందనే తర్కంలో నిజం లేకపోలేదని అర్థం అవుతుంది. ఆ ప్రణయానికి దూరాన ఉండి నటన సూత్రధారిణివలె అంతా నడిపించే బాధ్యతను సంతాన గోపాలస్వామి సహకారం కూడా తోడవడంవల్ల నా కళ్ళమీద ఎలాంటి పొరలు ఉండవు కనుక, అంతా సక్రమంగా నడుపగలనని హామీ ఇస్తున్నాను’’ అన్నది సరస్వతి.
‘‘నన్ను ఇక్కణ్నుంచే తీసుకుని వెళ్తావా?’’ అన్నాడు వీరభద్రుడు, సరస్వతి చెప్పిన మాటలతో కొంత ధైర్యం వచ్చి.
‘‘ఇంకా నయం!’’ అన్నది సరస్వతి. ‘‘ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? రాణి మిమ్ము కోరిందంటే ఎవరన్నా నమ్ముతారా? మీరే నా వెంటబడినట్లు స్పష్టంగా తెలియదా?’’
కొంటెగా అతని కళ్ళల్లోకి చూసి, అతని అజ్ఞానానికి సానుభూతీ, తన జ్ఞానానికి గర్వమూ స్పష్టమయేటట్లు నవ్విందామె.
ఐతే వీరభద్రుడు అదేమీ గమనించనట్లే నటించాడు. రుూ సరస్వతి తన ప్రియురాలికి నమ్మకమైన సేవిక మాత్రమే! అంటే తనకూ సేవకురాలే అనుకోవాలి. యజమానులే తనకు ఆహ్వానం పంపితే ఆమెనే కోరే తన హృదయంలో, చాలా తక్కువ అంతస్థులో వున్న సరస్వతికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానాన్ని ఇవ్వలేదు. అలా దిగజారడం సంతాన గోపాలుని ఆజ్ఞను అతిక్రమించడమేగాక ‘అధికం’ హస్తగతమయే అవకాశం అందుబటులో ఉండగా ‘అల్పానికి’ అర్రులుజాచేటంతటి మూర్ఖుడా తాను?
‘‘మరి ఏం చేయాలి?’’ అన్నాడు అంతా ఆమె చేతనే చెప్పించటం తనకు ఎంతో వీలుగా ఉంటుందనే సత్యాన్ని గ్రహించి.
‘‘కోటకు దక్షిణద్వారం ఒకటి ఉన్నది. బైట మహావృక్షాలు పెరిగి ఉన్నవి. కాస్త గమనించి చూస్తేనే తప్ప అక్కడొక ద్వారం ఉన్నదనే సంగతి తెలియదు. అక్కడికి కాలిబాట తప్ప రాజమార్గం లేదు. అల్లంత దూరంలో శ్మశానం తప్ప మరేమీ లేదు. రుూ గుర్తులు జ్ఞాపకం ఉంచుకొని ఆ ద్వారాన్ని పగలే ఒకటి రెండుసార్లు అటు వెళ్లి చూసుకోండి. శతృసేనలు కోటను ముట్టడించినప్పుడు, మరో మార్గం లేక, రాజ కుటుంబీకులు తప్పించుకొని పారిపోయేందుకు రుూ దక్షిణ ద్వారం ఏర్పాటు చేయబడింది. అవతల శ్మశానం కనుక చాలామంది రాత్రిపూట అటు వచ్చేందుకు భయపడతారు. ఆ మాటకొస్తే పగలు కూడా అక్కడ జన సంచారమే ఉండదు. శ్మశానానికి జేరవలసిన శవాలు వెళ్ళేందుకు వేరే రాజమార్గాలు ఉన్నవి.. ఈ ద్వారంతో ఎప్పుడూ పని ఉండదు కనుక దాన్ని తెరిచేందుకూ, మూసేందుకూ దాదాపు అవసరమే ఉండదు. ఇక్కడ కాపలా కూడా బహు తక్కువ. ఒకే ఒక్క యోధుడు ఉంటాడు. రాత్రి కాపలావాణ్ని కట్టుకున్నాను. వాడే తలుపు తీసి తమ ప్రవేశాన్ని అనుమతిస్తాడు. అదేవిధంగా తమ నిష్క్రమణకు కూడా ఆటంకం చెప్పదు.. రుూ ద్వారం దగ్గిర్నుంచి రాణివాసం కొద్ది దూరాన ఉండటం మనకు మరో అనుకూలం! .. రాజుగారు రారని నిర్థారణ చేసుకొని నేను తమకు తెలియపరుస్తాను. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెపుతాను- మీరు సరాసరి రావొచ్చు-’’
వీరభద్రుడికి అంతా కళ్ళకు కట్టినట్లయింది. కత్తెర బోనులాంటి రాణివాసంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగిరావటమంటే గరళం మింగి హరించుకోవటం లాంటిది; శవం సజీవమవటంలాటిదేననే అభిప్రాయం ఏర్పడుతోంది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు