డైలీ సీరియల్

దూతికా విజయం-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామందికి ఆ తెలివితేటలూ, సామర్థ్యం, నేర్పూ ఉండవు. కనుకనే ప్రపంచంలో నేరం చేయాలని ప్రయత్నించేవారి సంఖ్య తక్కువగానే వుంటూన్నది. అదీగాక ఆ అత్యవసర పరిస్థితుల ఒత్తిడి నెత్తిమీదకి రానంతవరకూ, పవిత్ర జీవితాన్ని గడిపేందుకు అందరూ ప్రయత్నిస్తారు. దీనికి ఉదాహరణ తమ జీవితమే! ఇక నేరాన్ని విజయవంతంగా రూపొందించేందుకు ముఖ్యమైనవి రెండు. అనుకూల వాతావరణమున్న స్థలమూ సరైన సమయమూనూ.’’
‘‘ఔను.. ఐతే?’’ అన్నది రాణి, సరస్వతి తనను ఎటు లాక్కొని పోతుందో అయోమయంగా తోచి.
‘‘రాణీ! రుూ కోటలోని వాతావరణం మనకు అనుకూలంగా ఉన్నదా?’’
‘‘లేదు.. మన తెలివితేటలతో పరిస్థితుల్ని సానుకూలం చేసుకోవాలి’’.
‘‘నిజమే.. అంతకన్నా -ఇంతకన్నా ఎంతో సానుకూలంగా వున్న స్థలాన్ని మనం ఎన్నుకుంటే?’’
‘‘ఎక్కడ ఆ స్థలం?’’
‘‘ఆలోచనకు అందని విషయం కాదిది రాణి!’’
‘‘నా బుర్ర మొద్దుబారుతుంది. చెప్పరాదా?’’ అన్నది రాణి విసుక్కుంటూ.
‘‘రాణీ! ఈ కోటలో ఎన్ని కళ్ళు మనను ప్రతిక్షణం కనిపెట్టి ఉంటవో నీకు తెలియనిది కాదు. అంటే ఇంత కట్టుదిట్టం వున్న స్థలం మనకు ప్రమాదకరం. ఇక్కడ ఏ చిన్న పొరపాటువల్ల పట్టుబడినా మరణదండన తప్పదు. రాజు- తన పరువు ప్రతిష్ఠలూ, తన ఆస్తిపాస్తులు దోచిపారవేయబడినట్లు భావించి, మన తలలు తీయించి కోట గుమ్మానికి వేళ్లాడదీస్తాడు. సమయ సందర్భాలూ రెండూ కలిసి వచ్చే తమ పుట్టింట అయితే?’’
సరస్వతి రాణి జవాబుకు వేచి వున్నది. రుూ కొత్త ఊహ రాణిలో తగిన సంచలనాన్ని కలిగించినట్లు ఆమెకు తోచలేదు.
అందుకని సరస్వతి విశదీకరించింది!
‘‘అది మనం పుట్టి పెరిగిన స్థలం. కోటలోని ప్రతి భాగమూ మనకు క్షుణ్ణంగా తెలుసు, అందరూ ఎరిగినవారే! ప్రతివారికీ మనమంటే ఎంతో గౌరవం. మనమీద నిఘా ఉండదు. ఒకవేళ పథకం దెబ్బతిన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ మన పట్ల సానుభూతి ఉంటుంది. ముఖ్యంగా శిక్షించవలసిన మహారాజు పితృపాదులే కనుక, తన కుమార్తె నేరం తన వంశానికి అప్రతిష్ట కనుక, మహారాజు మన్నలను మంటగలుపుతుంది కనుకా చూసీ చూడనట్లు ఊరుకొని క్షమించటమో, లేక గట్టిగా హెచ్చరించటమో జరుగుతుంది. ఆ మందలింపుదాకా కూడా రాకుండా మీ తల్లిగారు తప్పక సంరక్షిస్తారు. స్ర్తి పురుషుల మధ్య ప్రపంచాదిగా వుంటున్న వైరం ప్రపంచాంతం వరకూ కొనసాగేదే! వ్యభిచరించిన స్ర్తిని చూసి పురుషులందరూ తమ స్ర్తియే వ్యభిచరించిందన్న ఏవగింపుతో చూస్తారు. కాని తోటి స్ర్తికి బహిరంగంగా కాకున్నా, అంతరంగికంగానన్నా సానుభూతి ఉండి తీరుతుంది’’.
రాణి తీవ్రమైన ఆలోచనలో పడిన చిహ్నాలు కనిపించినవి. ఆమెకు ఈ పథకం నచ్చేట్లు చేసేందుకు సరస్వతి సాగించింది.
‘‘ఒక వస్తువును ఉత్పత్తి చేసేందుకు తగిన ముడిసరుకూ, కౌశలం ఉపయోగించదగిన వీలూ, అవసరం కదా! విధి రాసిన విజ్ఞాన, వికాస, వినోద, విలాస, విచిత్ర, విషాద, వికట కవిత్వానికి వివశులమై ఉన్న మనం కవితా వస్తువులం. గిజిగాని కులాయం లాంటి ఈ పథకానికి రూపురేఖలు దిద్దేందుకు తగిన ఖార్ఖానానూ, కార్యాలయాన్నీ ఎన్నుకోవటంలోనే చాకచక్యం చూపాలి. అక్కడ తమ పుట్టింట, మనకెంతో అనుకూల వాతావరణం వున్నది. పురుషుడూ, సర్వ స్వతంత్రుడూ, సామాన్యుడూ ఐన నీ ప్రియుణ్ని నా అవస్థ నేను పడి అక్కడికి జేరుస్తాను. ఇక్కడ దుస్సాధ్యంగా కనిపించేవాటిని అక్కడ సుసాధ్యం చేసుకుంటాను. మీ కోరిక చెల్లిస్తాను!’’ అన్నది సరస్వతి హామీ ధ్వనించే కంఠస్వరంతో.
రాణి మరికొంతసేపు ఆలోచించి అన్నది:
‘‘బాగానే వున్నది సరూ! కాని రాజు నన్నువిడిచి ఉండడు. నేనంటే ఆయనకు మక్కువ ఎక్కువ!’’
‘‘ఒక్క ముద్దన్నా గొంతు దిగని పరిస్థితుల్లో వున్నరోగికి విందు భోజనం మీదనే ఎక్కువ మక్కువ ఉండటం అబ్బురం కాదు!’’ అన్నది సరస్వతి, తనకున్న అక్కసునంతా వెళ్ళగక్కుతూ.
రాణి చిరునవ్వుతో సరస్వతి మాటల్ని అంగీకరించినట్లు సూచించింది.
‘‘నేను కోరగా, పోరగా పుట్టింటికి వెళ్ళేందుకు సమ్మతించినా అక్కడ మనను ఎక్కువ కాలం ఉండనీరు. మహా అయితే ఒక పక్షం జరుపగలమేమో? ఇదివరకు పుట్టింటిమీద మనసుపోయిందని ప్రాధేయపడితే ప్రభువు ఏమన్నారో తెలుసా?’’
‘‘మీతో అన్నది నాకెలా తెలుస్తుంది రాణీ? మీరు చెపితేనే కదా?’’
‘‘పురుడు పోసుకునేందుకు వెళ్ళవచ్చులే అన్నారు’’
‘‘‘గొప్పమాట సెలవిచ్చారు!’’ అన్నది సరస్వతి హేళనను ధ్వనింపజేస్తూ.
‘‘ఈ పథకం బాగున్నది, కానీ లాభం లేదు సరూ! అంత స్వల్ప వ్వధిలో మనం సాధించగలమనే ధైర్యం కూడా నాకు లేదు. అప్పుడు ఎటు తిరిగీ ఇక్కడ మళ్లీ అన్ని ఏర్పాట్లూ చేసుకోవాల్సిందే! ఈ విధంగా రెండుసార్లు రెండింతలశ్రమ దేనికి? పడే హైరానా ఏదో ఇక్కడే పడితే పోదా?’’
రాణిలో ప్రణయం ప్రజ్వరిల్లుతోందనీ, ఆ మంటల్లో పడవలసిన శలభాల జాబితా తయారుకాక తప్పదనీ సరస్వతి దృఢపరచుకున్నది.
‘‘ఇక్కడి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినవో చెప్పనేలేదు!’’ అన్నది రాణి.
‘‘ఏం చెప్పను రాణీ! ఇప్పుడే కదా నవరాత్రీ ఉత్సవాలు ముగిసింది! శుక్లపక్షం గడిచి, కృష్ణపక్షం వస్తేనే తప్ప ఏమీ చేయలేను!’’
‘‘జీవితంలోనూ చీకటే అనుకుంటే బైట కూడా చీకటే ఉండాలని రాసిపెట్టి ఉన్నది కదా!’’ అని రాణి దీర్ఘంగా నిట్టూర్చింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు